350 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, నిన్నటి లాభాలు కొనసాగింపు

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు (బుధవారం, మే 18) లాభాల్లో ఉన్నాయి. నిన్న భారీగా లాభపడిన సూచీలు, నేడు అదే ట్రెండ్‌ను కొనసాగించాయి. అమెరికా, ఐరోపా మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. ఆసియా-పసిఫిక్ సూచీలు మిశ్రమంగా ఉన్నాయి. హోల్ సేల్ ధరల ద్రవ్యోల్భణం 15.08 శాతానికి చేరింది. ఇది ఆందోళన కలిగిస్తోంది. ఆర్బీఐ జూన్ పరపతి సమీక్షా సమావేశం సందర్భంగా మరోసారి వడ్డీ రేటు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫెడ్ చైర్మన్ జెరోమ్ పోవెల్ ద్రవ్యోల్భణాన్ని అదుపు చేయడానికి అవసరమైతే వడ్డీ రేట్ల పెంపు తప్పదని, ఈ పెంపు కూడా వేగంగా ఉంటుందని చెప్పారు. ఇది మార్కెట్‌కు ప్రతికూలంగా మారవచ్చు.

సూచీలు ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 54,554 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, 54,786.00 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 54,409.53 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.11.45 సమయానికి సెన్సెక్స్ 267 పాయింట్లు లాభపడి 54,584 పాయింట్ల వద్ద, నిఫ్టీ 98 పాయింట్లు ఎగిసి 16,357 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. సెన్సెక్స్ ఉదయం ఓ సమయంలో 450 పాయింట్ల లాభాల్లో ట్రేడ్ అయింది.

BSE Sensex jumps 350 points, Nifty just shy of 16400

అన్ని రంగాలు కూడా లాభాల్లోనే ఉన్నాయి. మెటల్ సూచీలు 7 శాతం చొప్పున లాభపడ్డాయి. సెన్సెక్స్ 30లో పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, టాటా స్టీల్ షేర్లు మాత్రమే నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. బజాజ్ ఫైనాన్స్, అల్ట్రా టెక్ సిమెంట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, యాక్సిస్ బ్యాంకు, HDFC షేర్లు అత్యధికంగా లాభపడుతున్న వాటిలో ఉన్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+