adani: కొంతకాలంగా అదానీ గ్రూపు ఎదుర్కొంటున్న సంక్షోభం గురించి అందరికీ తెలిసిందే. రుణభారం తగ్గించుకుంటూ ఇన్వెస్టర్లలో ధైర్యం నింపడానికి సంస్థ చేయని ప్రయత్నాలు లేవని చెప్పవచ్చు. కానీ పెట్టుబడిదారులు పూర్తిగా విశ్వసించే పరిస్థితి లేకపోవడంతో తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. అయితే తాజాగా దేశంలోని ప్రముఖ ఎక్స్ఛేంజ్ లు NSE, BSE.. ఓ అదానీ కంపెనీపై తీసుకున్న నిర్ణయం మార్కెట్ లో చర్చనీయాంశమైంది.
ఏప్రిల్ 10 నుంచి అదానీ గ్రీన్ ఎనర్జీని దీర్ఘకాలిక అదనపు నిఘా(ASM) ఫ్రేమ్ వర్క్ లోని మొదటి దశలో ఉంచనున్నట్లు బాంబే మరియు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు తెలిపాయి. ఇదే సంస్థను మార్చి 28న ASMలోని రెండవ దశ కిందకు NSE, BSEలు తరలించాయి. దీంతో తాజా నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మేరకు రెండు వేర్వేరు సర్క్యులర్లను ఎక్స్ఛేంజ్ లు విడుదల చేశాయి.

ముఖ్యమైన కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుని సెక్యూరిటీలను ASM ఫ్రేమ్ వర్క్ కిందకు ఎక్స్ఛేంజీలు షార్ట్ లిస్ట్ చేస్తాయి. స్టాక్ హై-లో ప్రైస్ మధ్య తేడా, ప్రైస్ బ్యాండ్ హిట్స్, క్లోజ్ టు క్లోజ్ ప్రైస్ వేరియేషన్, PE నిష్పత్తి ఆధారంగా నిర్ణయం తీసుకుంటాయి. ASM ఫ్రేమ్ వర్క్ మొత్తం 4 స్టేజ్ లుగా ఉంటుంది. ఆయా షేర్లలో జరుగుతున్న అసాధారణ ట్రేడింగ్ వంటి పలు అంశాలు దీనిపై తీవ్ర ప్రభావం చూపుతాయి.

అయితే అదానీ గ్రూప్ లోని మొత్తం 10 లిస్టెడ్ కంపెనీల స్టాక్ లు గురువారం గ్రీన్ లో ట్రేడింగ్ ముగించాయి. అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్ మరియు NDTVలు 5 శాతం చొప్పున పెరిగాయి. గ్రూపులోని వివిధ సంస్థలు అప్పర్ సర్క్యూట్లను సైతం టచ్ చేశాయి. USకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక అనంతరం భారీగా క్షీణించిన స్టాక్స్, గత కొన్ని ట్రేడింగ్ సెషన్‌లలో గణనీయంగా కోలుకుంటున్నాయి.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications