Stock Market news: స్టాక్ మార్కెట్ లో ట్రేడర్స్ మరియు ఇన్వెస్టర్స్ కు స్టాప్ లాస్ ఎంతో ముఖ్యం. ఇది లేకుండా ఎవరూ అమ్మడం లేదా కొనడం వంటివి దాదాపు చేయరు. అంతటి ప్రాముఖ్యత కలిగిన స్టాప్ లాస్ కు BSE చరమగీతం పాడనుంది.
అక్టోబర్ 9 నుంచి స్టాప్ లాస్ మార్కెట్(SL-M) ఆర్డర్లను నిలిపివేస్తున్నట్లు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్(BSE) ప్రకటించింది. ఇటీవల వెలుగుచూసిన 'ఫ్రీక్ ట్రేడ్'కి సంబంధించి మార్కెట్ వర్గాల్లో ఆందోళన నెలకొనడంతో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్‌లు, కరెన్సీ డెరివేటివ్‌లు, కమోడిటీ డెరివేటివ్‌లు సహా పలు ఇతర మార్కెట్ విభాగాల్లోనూ SL-M ఆర్డర్లను నిలిపివేయాలని BSE నిర్ణయించింది. అయితే ఇదే స్టాప్ లాస్ ను మార్కెట్ ఆర్డర్ తో కలిపి కాకుండా లిమిట్ ఆర్డర్ ద్వారా ప్లేస్ చేసే అవకాశం కల్పించింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(NSE) దీన్ని సెప్టెంబరు 2021 నుంచి అమలు చేస్తుండగా.. ఇప్పుడు BSE సైతం అదే బాటలో నడవనుంది.
ఆర్డర్ ప్లేస్ చేయడంలో లిమిట్ ఆర్డర్స్ ఎక్కువ నియంత్రణతో పాటు ఖచ్చితత్వాన్ని అందిస్తాయని BSE భావిస్తోంది. తద్వారా మాన్యువల్ లేదా అల్గారిథమిక్ ట్రేడింగ్స్ లో తప్పుడు ఆర్డర్ ప్లేస్మెంట్లను నిరోధించడమే తమ లక్ష్యమని వెల్లడించింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications