Modi News: అంబానీ ఇంట పెళ్లి సందడి చూసి విలాసవంతమైన జీవితం అంటే ఇదిరా అని చాలా మంది కుళ్లుకున్నారు. అయితే వారికి మించిన రేంజ్‌లో జీవింత గడిపే వారు కూడా ఉన్నారు. ప్రస్తుతం మన ప్రధాని మోదీ బ్రూనై పర్యటనలో ఉన్నారు. ఆ దేశ సుల్తాన్ లైఫ్ స్టైల్ గురించి విని ప్రపంచం ఆశ్చర్యంలో మునిగి తేలుతుంది.
బ్రూనై సుల్తాన్ ఆహ్వానం మేరకు చారిత్రాత్మక పర్యటన కోసం ప్రధాని మోదీ సెప్టెంబర్ 3న బ్రూనై చేరుకున్నారు. రెండు రోజుల పాటు భారత ప్రధానమంత్రి మొదటిసారి అక్కడ పర్యటిస్తున్నారు. ఇరు దేశాల మధ్య 40 సంవత్సరాల దౌత్య సంబంధాలకు ఈ పర్యటన బూస్ట్ ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఈ పర్యటన కంటే ఆ దేశ సుల్తాన్ వైభవం గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు

రాజు హసనల్ బోల్కియా విలాసాల గురించి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే పలు కథనాలు అందుబాటులో ఉన్నాయి. కేవలం హెయిర్ కటింగ్ కోసం లక్షల మేర వెచ్చిస్తారని సమాచారం. ఆయన వాహన కలక్షన్‌లో సుమారుగా 600 రోల్స్-రాయిస్‌లు, 450 ఫెరారీలు మరియు 380 బెంట్లీలతో పాటు ఇతర ప్రీమియం బ్రాండ్‌లైన పోర్షెస్, లంబోర్ఘినిస్, మేబ్యాక్‌లు, జాగ్వార్‌లు, BMWలు మరియు మెక్‌లారెన్స్ ఉన్నాయి.ఈ సేకరణకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సైతం దాసోహం కావాల్సి వచ్చింది.
సుల్తాన్ బోల్కియా ప్రపంచంలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ ప్యాలెస్ అయిన ఇస్తానా నూరుల్ ఇమాన్ ప్యాలెస్‌లో నివసిస్తున్నారు. దీని విస్తీర్ణం 2 మిలియన్ చదరపు అడుగులు. 22 క్యారెట్ల బంగారంతో అలంకరించబడిన ఈ ప్యాలెస్‌లో 5 స్విమ్మింగ్ పూల్స్, 1700 బెడ్‌రూమ్‌లు, 257 బాత్‌రూమ్‌లు మరియు 110 గ్యారేజీలు ఉన్నాయి. ఆయనకు ఒక ప్రైవేట్ జూ మరియు బోయింగ్ 747 విమానం ఉంది.
క్వీన్ ఎలిజిబెత్-2 తర్వాత అత్యధిక కాలం పదవిలో ఉన్న పాలకుడిగా బోల్కియా రికార్డు సృష్టించారు. 40 బిలియన్ డాలర్లకు పైగా సంపదతో రాజకుటుంబం తులతూగుతూ ఉంటుందని తెలుస్తోంది. చమురు, గ్యాస్ ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. కేవలం హెయిర్ కటింగ్ ప్రైవేట్ జెట్‌లో 7 వేల మైళ్లు ప్రయాణించి లండన్‌లోని ది డోర్‌చెస్టర్ హోటల్‌లోని మేఫెయిర్‌కు వెళతారు. అక్కడ ఇందుకోసం దాదాపు 16 లక్షలు వెచ్చిస్తారట.


Click it and Unblock the Notifications