Congress Debts: రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలు పాలన కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో గత ప్రభుత్వాలు తెచ్చిన అప్పులను తీర్చటంతో పాటు ఇచ్చిన హామీల అమలుకు ఈ ప్రభుత్వాలు భారీగా అప్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది రాజకీయంగా అధికార విపక్షాల మధ్య పెద్ద రగడకు దారితీయటంతో పాటు సామాన్యుల్లో సైతం డిబేట్ కొనసాగుతోంది.
హైదరాబాదులో హైడ్రా కూర్చివేతలపై ఘాటుగా స్పందిస్తున్న మంత్రి కేటీఆర్.. తాజాగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలు పూర్తయిన వేళ అప్పులు ఫుల్ అభివృద్ధి నిల్ అంటూ ట్విట్టర్ వేదికగా కీలక కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కుర్చీ ఎక్కిన రోజు నుంచి తెలంగాణ ప్రభుత్వం చేసిన మెుత్తం అప్పుల విలువ రూ.80,500 కోట్లుగా ఉన్నట్లు వెల్లడించారు. కేవలం 10 నెలల కాలంలో రికార్డు స్థాయిలో రేవంత్ సర్కార్ అప్పులు చేసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదని, ఒకప్పుడు అప్పులు తప్పు అన్న వాళ్లు ప్రస్తుతం భారీగా రుణాలు తెస్తున్నారని, వాళ్లను ప్రస్తుతం దేనితో కొట్టాలంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఈ 10 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ కొత్త సాగునీటి ప్రాజెక్టును కట్టలేదని బీఆర్ఎన్ నేత కేటీఆర్ విమర్శించారు. అలాంటప్పుడు తెస్తున్న అప్పులు ఎటుపోతున్నాయని, ఈ 80 వేల కోట్ల ధనం ఎవరి జేబుల్లోకి వేళ్లినట్టంటూ ప్రశ్నించారు. బడా కాంట్రాక్టర్ల బిల్లులకే ధారాదత్తం చేస్తున్నారా ? కమిషన్ల కోసం కక్కుర్తి పడే అప్పులు తెస్తున్నారా అంటూ రేవంత్ సర్కార్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఒకప్పుడు అప్పు శుద్ధ తప్పని ప్రచారం చేసి ప్రస్తుతం అవే అప్పుల కోసం ముఖ్యమంత్రి పాకులాడుతున్నారని ట్విట్టర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్ కుర్చీ ఎక్కిన రోజు నుండి తెచ్చిన మొత్తం అప్పులు 80,500 కోట్లు.
— KTR (@KTRBRS) October 16, 2024
10 నెలల్లో 80,500 కోట్ల రికార్డు అప్పులు!!
అప్పు- తప్పు అన్నోళ్లని.. ఇప్పుడు దేనితో కొట్టాలి..? ఎన్నికల హమీలేవీ తీర్చలేదు..!
ఏ కొత్త సాగునీటి ప్రాజెక్టు కట్టలేదు..!!
మరి ముఖ్యమంత్రి తెస్తున్న అప్పు ఏమైనట్టు…
గత బీఆఎస్ హయాంలో తాము అప్పుగా తెచ్చిన సొమ్ముతో ప్రాజెక్టులు నిర్మించామని, ప్రతి పైసాను మౌలిక సదుపాయాల పెంపుకు వినియోగించామని ఈ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజల దశాబ్ధాలుగా పడుతున్న కష్టాలను రుణంతో తీర్చామని కానీ ప్రస్తుతం తెస్తున్న అప్పులు ఎటుపోతున్నాయో అడ్రస్ తెలియటం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయకుండా, రైతుభరోసా చేయకుండా, అస్సలు కొత్త ప్రాజెక్టులు కట్టకుండా, నెలల పాటు వేతనాలు చెల్లించకుండా అప్పుగా తెస్తున్న డబ్బును ఎవరి జోబుల్లోకి మళ్లిస్తున్నారని అధికార ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సంపద సృష్టి కాకుండా సొంత ఆస్తులను పెంచుకోవటానికి అప్పులు చేయటం క్షమించరాని నేరంగా కేటీఆర్ పేర్కొన్నారు. ఇది తెలంగాణ భవిష్యత్తుకు పెను ప్రమాదంగా మారతాయని అన్నారు.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications