Arogya Mahila: రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చాలని సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా వైద్యంపై భారీగా ఖర్చుచేస్తున్నారు. ఇప్పటికే ఆసుపత్రులను భలోపేతం చేయటం, బస్తీ దవాఖానా, పల్లె దవాఖానా, కంటి వెలుగు వంటి ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు.
ఇదే క్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల ఆరోగ్యంపై దృష్టి సారించింది. కుటుంబంలో మహిళల పాత్ర పెద్దది.. వారు ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం ఆర్థికంగా ముందుకు సాగటానికి వీలుంటుందని కేసీఆర్ నమ్ముతున్నారు. ఇందుకోసం ఆరోగ్య మహిళ కార్యక్రమం కింద ప్రతి మంగళవారం ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వయసుల మహిళలకు ఉచిత సమగ్ర వైద్యసేవలు అందిస్తోంది.

ఆరోగ్య మహిళ కార్యక్రమం కింద తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 19,000 మంది మహిళలు సేవలను పొందారు. మంగళవారం నాడు 100కి పైగా ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో, 8 సూపర్ స్పెషాలిటీల్లో మొత్తం 7,965 మంది మహిళలు 57 రకాల ఆరోగ్య సంరక్షణ సేవల కోసం పరీక్షలను పొందారు. వీరిలో 5425 మందికి బ్రెస్ట్ క్యాన్సర్, 5423 మందికి నోటి క్యాన్సర్, 1463 మందికి గర్భాశయ క్యాన్సర్, 654 మందికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, 1735 మంది సూక్ష్మపోషకాల లోపం, 1682 మంది థైరాయిడ్ పరీక్ష, 1128 విటమిన్ పరీక్షలు, 1128 మందికి విటమిన్ డి వంటి అనేక రకాల రోగనిర్థారణ పరీక్షలు జరిగాయి.
తెలంగాణలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను అమలు చేయటంలో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు దేశంలో ఎక్కడా లేని విధంగా కొత్త పథకాలను రూపొందించి ఆరోగ్య తెలంగాణను నిర్మించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications