Muhurat Trading 2024: దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడర్లు, ఇన్వెస్టర్లు సాంవత్ 2081కి సిద్ధమౌతున్నారు. ఈ క్రమంలో చాలా మంది బ్రోకరేజీలు ప్రకటించే వివిధ రిపోర్టులను పరిశీలిస్తూ.. తమ బడ్జెట్లో ముహురత్ ట్రేడింగ్ కోసం షేర్లను సెలెక్ట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 14 నెలల కనిష్ఠానికి పడిన వేళ మార్కెట్లలో భారీగా అమ్మకాలకు ఇన్వెస్టర్లు దిగుతున్నారు. దీనికి తోడు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు అక్టోబరులో భారీగా తమ డబ్బును వెనక్కి తీసుకోవటంతో మార్కెట్లలో సెంటిమెంట్లు దెబ్బతిన్నాయి. దీపావళి, సంవత్ 2081 ప్రారంభానికి కొన్ని రోజుల ముందు మార్కెట్లలో బేరిష్ మెుమెంటం కనిపించటం ఆందోళన కలిగిస్తోంది.
ఈ క్రమంలో దేశీయ బ్రోకరేజ్ సంస్థ ఫండ్ ఇండియా దీపావళి 2024 నుంచి రానున్న దీపావళి వరకు మంచి రాబడులను అందించే 6 క్వాలిటీ షేర్లను ఇన్వెస్టర్ల సాంవత్ 2081 కోసం ప్రకటించింది. వీటిని వివిధ రంగాల నుంచి ఎంపిక చేసింది. ఈ క్రమంలో ముందుగా కల్యాణ్ జ్యూవెలర్స్ షేర్లను రూ.676 రేటు వద్ద కొనుగోలు చేయాలని సూచిస్తూ టార్గెట్ ధరను రూ.846గా నిర్ణయించిందన్నారు. కంపెనీ ఆదాయ వృద్ధి, పెరిగిన ప్రమోటర్ వాటాలతో భారతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో విస్తరిస్తోంది. ఆర్థిక సంవత్సరంలో విదేశాల్లో 6, దేశీయంగా 130 షోరూమ్ లను తెరవటంపై బ్రోకరేజ్ సానుకూలంగా ఉంది. అలాగే సేమ్ స్టోర్స్ సేల్స్ ఇతర ఆగటాళ్ల కంటే పెరిగిందని వెల్లడించింది. ఇక బ్రోకరేజ్ రెండవ ఎంపికగా సీడీఎస్ఎల్ షేర్లను ఎంచుకుంటూ రూ.1461 రేటు వద్ద కొనుగోలు చేయవచ్చని సూచించింది. అలాగే టార్గెట్ ధరను రూ.1845 వద్ద ఉంచింది. రిటైల్ పెట్టుబడిదారుల సంఖ్య పెరగటంతో పాటు ఈ రంగంలో ఏకచత్రాదిపత్యాన్ని స్టాక్ కలిగి ఉన్నట్లు పేర్కొంది.

బ్రోకరేజ్ ఎంచుకున్న మూడవ స్టాక్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ. తాజాగా కంపెనీ అదానీని ఓడించి బిడ్డింగులో కెఎస్‌కె మహానది పవర్ కంపెనీని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కంపెనీ షేర్లను రూ.670 వద్ద కొనుగోలు చేయవచ్చని సూచిస్తూ టార్గెట్ ధరను రూ.825 వద్ద ఉంచింది. కంపెనీ 2030కి ముందు 20 GW ఉత్పాదక సామర్థ్యాన్ని, 40 GWh ఎనర్జీ స్టోరేజీ సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో పవర్ సెక్టార్ ల్యాండ్‌స్కేప్ వృద్ధి చెందుతున్న వేళ కంపెనీ షేర్లను బ్రోకరేజ్ ఎంచుకుంది. ఇదే క్రమంలో బ్యాంకింగ్ రంగానికి చెందిన ఫెడరల్ బ్యాంక్ షేర్లను రూ.189 రేటు వద్ద కొనుగోలు చేయవచ్చని సూచిస్తూ టార్గెట్ ధరను రూ.235గా ఉంచింది. బ్యాంక్ కార్యకలాపాలను విస్తరించటం వృద్ధికి దోహదపడుతున్నట్లు బ్రోకరేజ్ వెల్లడించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో 140 కొత్త శాఖలను ఓపెన్ చేసింది.
ఫార్మా రంగానికి చెందిన మ్యాన్ కైండ్ ఫార్మా కంపెనీ షేర్లను బ్రోకరేజ్ ఎంచుకుంది. ఈ క్రమంలో షేర్లను రూ.2566 రేటు వద్ద కొనుగోలు చేయాలని సూచిస్తూ టార్గెట్ ధరను రూ.3158 వద్ద ఉంచింది. కంపెనీ కొత్త ఉత్పత్తుల తయారీలోకి విస్తరించటం అభివృద్ధికి దారితీస్తోందని బ్రోకరేజ్ వెల్లడించింది. కంపెనీ ప్రస్తుతం గైనకాలజీ-ఫెర్టిలిటీ విభాగంలో మార్కెట్ లీడర్‌గా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక చివరిగా బ్రోకరేజ్ దీపావళికి వెల్‌స్పన్ కార్ప్ కంపెనీ షేర్లను ఎంచుకుంది. కంపెనీ షేర్లను రూ.681 రేటు వద్ద కొనుగోలు చేయవచ్చని పేర్కొంటూ టార్గెట్ ధరను రూ.840గా నిర్ణయించింది. జల్ జీవన్ మిషన్ పైపింగ్ విభాగానికి బలమైన డిమాండ్ పైప్‌లైన్‌ను సృష్టిస్తుందని బ్రోకరేజ్ వెల్లడించింది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications