గందరగోళంలో Upstox, Zerodha యూజర్లు.. పనిచేయని సెల్ ఆర్డర్లు, పూర్తి వివరాలు..

Trading News: నేడు దేశీయ స్టాక్ మార్కెట్లోని ఇన్వెస్టర్లు గందరగోళంలో ఉన్నారు. వాస్తవానికి ప్రముఖ బ్రోకరేజ్ ఫ్లాట్ ఫారమ్‍లు జెరోధా, అప్‍స్టాక్స్ యూజర్లు పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నారు. దీని కారణంగా వేల సంఖ్యలో యూజర్లు తమకు నష్టం జరుగుతోందని వాపోతున్నారు.

వివరాల్లోకి వెళితే సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ సేవలు బ్రోకర్ల మధ్య తాత్కాలికంగా నిలిచిపోయినందున కస్టమర్‌లు తన సెల్ ఆర్డర్లను ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నట్లు ప్రముఖ బ్రోకరేజీ సంస్థలు వెల్లడించాయి. ఈ సమస్యను పరిష్కరించటానికి తాము సీడీఎస్ఎల్ తో నిరంతరం ప్రయత్నిస్తున్నట్లు బ్రోకరేజ్ సంస్థ అప్‌స్టాక్స్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వెల్లడించింది. ఇదే క్రమంలో జెరోధా స్పందిస్తూ సీడీఎస్ఎల్ లో సమస్య కారణంగా మీరు స్టాక్స్ విక్రయించటానికి అధికారం ఇవ్వడంలో సమస్యలు ఎదుర్కోవచ్చని పేర్కొంది. దీనిని వీలైనంత త్వరగా పరిష్కరించటానికి తాము సంబంధింత చర్యలు చేపడుతున్నట్లు పేర్కొంది. అయితే ఈ క్రమంలో మీరు సీడీఎస్ఎల్ ఆథరైజేషన్ లేకుండా కూడా సెల్ ఆర్డర్లు పెట్టవచ్చని జెరోధా స్పష్టం చేసింది.

Brokerages Upstox Zerodha facing issue as sell orders not getting CDSL authorisation

వాస్తవానికి ఎవరైనా యూజర్ తన పెట్టుబడులను బ్రోకరేజ్ ద్వారా విక్రయించటానికి ముందుగా ఓటీపీ లేదా ఇతర పద్ధతుల ద్వారా ట్రాన్సాక్షన్ చేసేందుకు అనుమతి సీడీఎస్ఎల్ నుంచి పొందాల్సి ఉంటుంది. అలా చేసినప్పుడు మాత్రమే డిపాజిటరీ సదరు ఆర్టర్‍లోని కొనుగోలుదారులకు షేర్లను రిలీజ్ చేస్తుంది. ఇలా చేయటం ద్వారా పెట్టుబడిదారులకు అధిక భద్రతను కల్పిస్తుంది. ఇదే క్రమంలో మరో బ్రోకరేజ్ సంస్థ గ్రో తాము కూడా నేడు సీడీఎస్ఎల్ నుంచి ఆథరైజేషన్ సమస్యలను అందుకున్నామని, అయితే అది పరిష్కరింపబడిందని వెల్లడించింది. చాలా బ్రోకరేజీ సంస్థల యూజర్లు ఇదే తరహా ఇబ్బందిని ఎదుర్కొన్నారని పేర్కొన్న గ్రో.. ప్రస్తుతం సమస్య పరిష్కరింపబడినందున యూజర్లు తిరిగి కొత్త ఆర్డర్లను ప్లేస్ చేయవచ్చని వెల్లడించింది.

చాలా మంది యూజర్లు తాము ఎదుర్కొంటున్న సమస్య గురించి ట్విట్టర్ వేదికగా జెరోధాకు వెల్లడించారు. ఉదయం నుంచి తమ డీమ్యాట్ ఖాతాల్లో ఉన్న షేర్లను ఆథరైజేషన్ ఇష్యూ కారణంగా నిర్వహించలేకపోతున్నట్లు స్క్రీన్ షార్ట్స్ కూడా షేర్ చేశారు. కొందరు టీ పిన్ ఇష్యూ సమస్య ఎదుర్కొంటున్నట్లు కూడా ఇందులో వెల్లడించారు. ఇదే క్రమంలో గ్రో యూజర్లు సైతం తమ ఆగ్రహాన్ని పంచుకున్నారు. అయితే గతంలో కూడా అనేకసార్లు జెరోధా ఫ్లాట్ ఫారమ్ డౌన్ కావటంతో ట్రేడర్లు ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు కనిపించాయి.

Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+