independence day stock: పండుగలు సహా పలు ప్రత్యేక సందర్భాలకు గుర్తుగా ఏదో ఒకటి కొనుగోలు చేయడం భారతీయులకు అలవాటే. ఇటీవల కాలంలో ప్రజల ఆర్థిక స్వాతంత్ర్యం మెరుగుపడటంతో ఈ కొనుగోళ్లు కాస్తా స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులుగా మారాయి. ఈరోజు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇన్వెస్ట్ చేసేందుకు పలు బ్రోకరేజ్ సంస్థలు బుల్లిష్‌గా చూస్తున్న ఓ మంచి స్టాక్స్ గురించి తెలుసుకుందాం..
అయోధ్య రామ మందిరం నిర్మాణ సంస్థ, మల్టీ బ్యాగర్‌గా పేరుగాంచిన L&T స్టాక్‌పై బ్రోకరేజ్ సంస్థలు పాజిటివ్ ఉన్నాయి. ఈ లార్జ్ క్యాప్ ఇన్‌ఫ్రా స్టాక్ కొనుగోలు చేయాలని సూచిస్తున్నాయి. NSEలో సదరు సంస్థ ఆల్ టైం లాభాలు కళ్లు చెదిరే స్థాయిలో ఏకంగా 19,389.57 శాతంగా నమోదయ్యాయి. అంతే కాకుండా ఇటీవల బుల్లిష్ ట్రయాంగిల్ ఏర్పాటు చేసినట్లుగా ఈ స్టాక్ మూమెంట్ ను పరిశీలిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

20 మరియు 50 రోజుల ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ ఆశాజనకంగా ఉన్నట్లు బ్రోకరేజ్‌లు అంచనా వేశాయి. బలమైన బుల్లిష్ ట్రెండ్‌కు ఇది సూచనగా పేర్కొన్నాయి. వీటికి తోడు RSI కూడా 46ని టచ్ చేయడంతో లాభాల ట్రెండ్ కొనసాగుతుందని బలంగా విశ్వసిస్తున్నాయి. వీటి ఆధారంగా కొనుగోళ్లు ఊపందుకున్నట్లు కన్ఫర్మ్ చేస్తున్నాయి. రానున్న రానున్న రోజుల్లో L&T స్టాక్ విలువ భారీగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు లెక్కగట్టాయి.
మార్కెట్ పతనం అవుతున్న సమయంలో 3 వేల 540 స్థాయిల వద్ద కొనుగోలు చేయడం ఉత్తమమని ఛాయిస్ బ్రోకింగ్ సంస్థ సూచించింది. టెక్నికల్ ఎనాలిసిస్ సహా ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను గమనిస్తే 4 వేల 100 టార్గెట్ ప్రైస్ గా భావిస్తున్నట్లు చెప్పింది. ఇక వివేకంతో కూడిన రిస్క్ మేనేజ్మెంట్ పరిగణలోకి తీసుకుంటే 3 వేల 925 వరకు ఆశించవచ్చని తెలిపింది. కాగా ఈ సంస్థ షేర్లు సంవత్సరంలో 33.5 శాతం మరియు ఐదేళ్లలో 166 శాతం రాబడి ఇచ్చాయి.


Click it and Unblock the Notifications