Budget 2023: ఫిబ్రవరి మాసంలో యూనియన్ బడ్జెట్ కి ముందు చాలా రంగాల్లో అలజడి మెుదలైంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొన్ని రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని ఊహాగానాలు నడుస్తున్నాయి. దీంతో దలాల్ స్ట్రీట్ లో ఇన్వెస్టర్ల సందడి నడుస్తోంది. అయితే ఎన్నికలకు ముందు 5 రాష్ట్రాల ఎన్నికలు రానున్న తరుణంలో ప్రభుత్వానికి ఇది పెద్ద సవాలుతో కూడినదిగా తెలుస్తోంది.

ఫోకస్ రంగం..
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగం, దాని అనుబంధ పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల వచ్చే 3-4 త్రైమాసికాల్లో కొన్ని స్టాక్ మార్కెట్ లిస్టెడ్ కంపెనీలు లాభపడవచ్చని తెలుస్తోంది. కంపెనీల ఆర్డర్ బుక్, మార్జిన్లు మెరుగుపడతాయని నిపుణులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ రంగంలోని కొన్ని స్టాక్స్ ఇన్వెస్టర్లకు మంచి రాబడులు తెచ్చిపెట్టగలవని.. ముందుగా వాటిలో పెట్టుబడులు పెట్టడం ఉత్తమం అని వారు చెబుతున్నారు.

ఈ రంగం ఎందుకు..
ప్రస్తుతం దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న రంగాల్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగం కీలకం. అందుకే ఈ రంగంలోని షేర్లు లాభపడవచ్చని ప్రాఫిట్‌మార్ట్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ అవినాష్ గోరక్షకర్ చెబుతున్నారు. ఈ కారణంగా రాబోయే ఒకటిన్నర సంవత్సరాల కాలంలో మౌలిక సదుపాయాల కంపెనీలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ప్రత్యేక దృష్టిలో ఉండబోతున్నాయి.

మోతీలాల్ ఓస్వాల్..
రాబోయే యూనియన్ బడ్జెట్ ప్రభుత్వం కోరుకునే విధంగా మౌలిక సదుపాయాలు, అనుబంధ రంగాలపై దృష్టి పెట్టబోతోందని మోతీలాల్ ఓస్వాల్ డెరివేటివ్ & టెక్నికల్ అనలిస్ట్ చందన్ తపారియా అభిప్రాయపడుతున్నారు. బడ్జెట్ 2023 సమర్పణ తర్వాత ఇన్‌ఫ్రా స్టాక్‌లకు ఆజ్యం పోసేలా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నుంచి ఏదైనా పెద్ద ప్రకటన వస్తుందని తాను గట్టిగా నమ్ముతున్నానని ఆయన చెప్పారు.

లాభపడే స్టాక్స్
2023 బడ్జెట్ కంటే ముందు కొనుగోలు ఇన్‌ఫ్రా రంగంలోని కొన్ని షేర్లు కొనుగోలు చేయటం ఉత్తమమైన నిర్ణయమని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా.. ఎన్‌సీసీ , కెఎన్‌ఆర్ కన్స్ట్రక్షన్స్, కమిన్స్ ఇండియా, ఎల్ అండ్ టీ మొదలైన స్టాక్‌లను గమనించాలని పొజిషనల్ ఇన్వెస్టర్లకు సూచించారు. రాబోయే యూనియన్ బడ్జెట్ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి చివరి పూర్తి బడ్జెట్ అవుతుంది. ఈ క్రమంలో మోదీ సర్కార్ ప్రతిపక్షాల నుంచి దాడిని తట్టుకునేందుకు ప్రజా-కేంద్రీకృత బడ్జెట్‌ను ప్రభుత్వం సమర్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Note: పైన అందించిన వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకోకండి. మార్కెట్లలో పెట్టుబడులు రిస్క్ తో కూడుకున్నవి. మీ అర్థిక సలహాదారుడిని ముందుగా సంప్రదించటం ఉత్తమం.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications