Stock Sugessions: లాభాలు కావాలంటే ఈ షేర్ కొనండి.. 37 మంది నిపుణులు సూచిస్తున్నారు..!
Stock Sugessions: స్టాక్ మార్కెట్లో అందరూ కోరుకునేది మంచి లాభాలు. అయితే ఇవి పొందటానికి ముఖ్యమైనది సరైన కంపెనీల షేర్లలో పెట్టుబడులు పెట్టడం. ఇందుకోసం కొంత రీసెర్చ్ కూడా తప్పక చేయాల్సి ఉంటుంది.
రానున్న కొన్ని రోజుల్లో మంచి లాభాలను అందించగలిగిన ఒక కంపెనీ షేర్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనందరికీ సుపరిచితమైన, ప్రభుత్వ యాజమాన్యంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు రాకెట్ వేగాన్ని అందుకునేందుకు దగ్గరలో ఉన్నాయని నిపుణులు బల్లగుద్ది చెబుతున్నారు. ప్రస్తుతం స్టాక్ ధర రూ.574.35గా ఉండగా.. దాదాపు 37 శాతం పెరిగి రూ.790ని చేరుకోవచ్చని దేశీయ బ్రోకరేజ్ సంస్థ BNP పారిబాస్ సెక్యూరిటీస్ సోమవారం విడుదల చేసిన నోట్‌లో పేర్కొంది.

ఇదే క్రమంలో ఇతర బ్రోకరేజ్ సంస్థలు అందించిన టార్గెట్ ధరలను పరిశీలిస్తే.. ప్రభుదాస్ లిల్లాధర్ తన టార్గెట్ ధరను రూ.770 వద్ద ఉంచుతూ బై రేటింగ్ ఇచ్చింది. ఇదే సమయంలో మరో బ్రోకరేజ్ సంస్థ JM ఫైనాన్షియల్ కూడా రూ.710 టార్గెట్‌తో కొనుగోలకు సూచించింది. మార్కెట్లో మెుత్తం 41 మంది నిపుణుల్లో 37 మంది స్టేట్ బ్యాంక్ షేర్లు కొనుగోలు చేయొచ్చని సూచించారు. ఇదే సమయంలో ఇద్దరు హోల్డ్ చేయాలని, మరో ఇద్దరు ప్రస్తుత ధరల వద్ద షేర్లను విక్రయించి లాభాలు స్వీకరించొచ్చని పేర్కొన్నారు.
SBI ఈక్విటీపై రాబడిని పరిశీలిస్తే.. గత ఐదేళ్లుగా నిరంతరం పెరుగుతూనే ఉంది. 2019లో దీని ROE 0.35 శాతం ఉండగా.. 2020లో 6.74 శాతానికి, 2021లో 9.02 శాతానికి, 2022లో 12.91 శాతానికి చేరుకుంది. 2023లో ఇప్పటివరకు ఈక్విటీ రాబడులు 18.05 శాతానికి పెరిగాయి. అలాగే గడచిన ఐదేళ్లలో షేర్ ధర 102 శాతానికి పైగా పెరిగింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 6.25 శాతం క్షీణించింది. ఈ క్రమంలో స్టాక్ 52 వారాల గరిష్ట ధర రూ.629.55గా, కనిష్ట ధర రూ.499.35గా ఉంది.


Click it and Unblock the Notifications