Tata Motors: ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లలో టాటాలకు చెందిన ఆటో దిగ్గజం టాటా మోటార్స్ కంపెనీ షేర్లపై అందరి దృష్టి కొనసాగుతోంది. నిపుణులు సైతం షేర్ల కొనుగోలుకు సూచించటంతో లూటీ కొనసాగుతోంది.
నేడు టాటా మోటార్స్ కంపెనీ షేర్లలో భారీ పెరిగుదల నమోదు కావటంతో బీఎస్ఈలో కంపెనీ షేర్లు 8 శాతం కంటే ఎక్కువ పెరుగుదలతో రూ.949.60 స్థాయికి చేరుకున్నాయి. అలాగే ఎన్ఎస్ఈలో రేటు 7 శాతానికి పైగా పెరిగి సరికొత్త 52 వారాల గరిష్ఠమైన రూ.950 స్థాయిని అందుకుంది. అయితే ఈ అనూహ్య ర్యాలీకి కంపెనీ క్యూ3 అద్భుత ఫలితాలే కారణంగా తెలుస్తోంది. కంపెనీ ఈవీ వాహనాల అమ్మకాల్లో విజయం సాధించటంతో పాటు మార్జిన్లు వృద్ధి చెందటంపై బ్రోకరేజ్ సంస్థలు ఆశాజనకంగా ఉన్నాయి.

ప్రముఖ బ్రోకరేజ్ నోమురా ఇండియా టాటా మోటార్స్ షేర్లపై బుల్లిష్‌గా ఉంది. రానున్న కాలంలో షేర్ ధర రూ.1,057 మార్కును అందుకుంటుందని బ్రోకరేజ్ హౌస్ అభిప్రాయపడింది. ఇదే క్రమంలో గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ కూడా టాటా మోటార్స్‌కు BUY రేటింగ్ అందించింది. తన అంచనాల ప్రకారం టాటా మోటార్స్ స్టాక్ ధర రూ.1,100 వరకు పెరగవచ్చని జెఫరీస్ అభిప్రాయడింది. వాస్తవానికి జేఎల్ఆర్ బలమైన ఆర్థిక పనితీరు టాటా మోటార్స్ షేర్లపై సానుకూల ప్రభావానికి కారణంగా మారింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో టాటా మోటార్స్ లిమిటెడ్ నికర లాభం 133.32 శాతం పెరిగి రూ.7,100 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి కంపెనీ నికర లాభం కేవలం రూ.3,043 కోట్లుగా ఉంది. డిసెంబర్ త్రైమాసికంలో ఏకీకృత ఆదాయం 25 శాతం పెరిగి రూ.1,10,600 కోట్లకు చేరుకుందని టాటా మోటార్స్ ఆర్థిక గణాంకాలు వెల్లడిచాయి. జాగ్వార్, ల్యాండ్ రోవర్‌లో కాలానుగుణత, కొత్త మోడల్‌లు మరియు సరఫరా మెరుగుదలల కారణంగా గత త్రైమాసికంలో పనితీరు మరింత మెరుగుపడుతుంది. అలాగే కంపెనీ నికర రుణం త్రైమాసిక కాలంలో రూ.9,500 కోట్ల మేర తగ్గటం సానుకూల అంశంగా ఉంది.


Click it and Unblock the Notifications