Yes Bank Shares: దేశీయ స్టాక్ మార్కెట్లలో తక్కువ రేటు వద్ద అందుబాటులో ఉండే కంపెనీ షేర్లను కొనుగోలు చేసేందుకు పెట్టుబడిదారుల నుంచి నిరంతరం డిమాండ్ ఉంటూనే ఉంటుంది. ఈ కేటగిరీకి చెందిన బ్యాంకింగ్ స్టాక్ యెస్ బ్యాంక్ షేర్లపై ప్రస్తుతం మార్కెట్లో పెద్ద చర్చ జరుగుతోంది.
వివరాల్లోకి వెళితే గడచిన నెల రోజులుగా యెస్ బ్యాంక్ షేర్ల ధరలు నిరంతరం క్షీణిస్తూనే ఉన్నాయి. శుక్రవారం ప్రైవేట్ బ్యాంక్ షేర్ల ధర 0.51 శాతం పడిపోయి మార్కెట్ల ముగింపు సమయంలో ఒక్కో షేరు రూ.23.62 వద్ద ముగిసింది. కేవలం ఒక నెలలోనే యెస్ బ్యాంక్ షేర్ల ధరలు 8.06 శాతం క్షీణించటం కొంత ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 9న కంపెనీ షేర్లు తమ 52 వారాల గరిష్ఠ ధర రూ.32.81కి చేరుకుంది. దీని తర్వాత కంపెనీ షేర్లు ఇప్పటి వరకు 28 శాతం క్షీణించాయి.

ప్రస్తుతం మార్కెట్లోని చాలా మంది నిపుణులు యెస్ బ్యాంక్ షేర్లను విక్రయించాలని సలహా ఇస్తున్నారు. రానున్న కాలంలో కంపెనీ షేర్లు రూ.19-20 స్థాయికి దిగజారవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలో దేశీయ ప్రముఖ బ్రోకరేజ్ కోటక్ ఇనిస్టిట్యూషనల్ యెస్ బ్యాంక్ షేర్లకు 'SELL' రేటింగ్ ఇచ్చింది. యెస్ బ్యాంక్ షేర్ల సరసమైన విలువ రూ.19 అని బ్రోకరేజ్ వెల్లడించింది. ఇదే క్రమంలో ఈక్వినామిక్స్ రీసెర్చ్ ఎండీ చొక్కలింగం కంపెనీ షేర్లకు సెల్ రేటింగ్ ఇచ్చారు. ప్రస్తుతం దేశీయ బ్యాంకింగ్ రంగం తక్కువ రుణ వృద్ధి, పరిశ్రమలో పెరుగుతున్న పోటీ, మొత్తం పరిశ్రమలో డిపాజిట్ల వృద్ధి క్షీణించడం అంశాలను ఆయన ఎత్తి చూపారు. దీంతో టార్గెట్ ధరను రూ.20గా అంచనా వేశారు.
ఏప్రిల్ నుండి జూన్ 2024 మధ్య కాలంలో నికర వడ్డీ మార్జిన్ 2.5 శాతం నుంచి 2.4 శాతానికి తగ్గింది. అయితే బ్యాంకు లాభం మాత్రం పెరిగింది. యెస్ బ్యాంక్ లాభం వార్షిక ప్రాతిపదికన 46.7 శాతం పెరుగుదలతో రూ.502 కోట్ల స్థాయికి చేరుకుంది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications