Suzlon Stock: సుజ్లాన్ స్టాక్ డబుల్.. బ్రోకరేజీలు ఏమంటున్నారంటే?

Suzlon Energy: దేశీయంగా ఎనర్జీ రంగానికి చెందిన సుజ్లాన్ కంపెనీ షేర్లు చాలా కాలంగా పెట్టుబడిదారులను ఆకర్షిస్తూనే ఉన్నాయి. కంపెనీ వ్యాపారం ప్రభుత్వ దీర్ఘకాలిక ప్రణాళికలతో భారీగా ఊపందుకుంది. అయితే ఈ మల్టీబ్యాగర్ షేర్లను ప్రస్తుత ధరల వద్ద కొనసాగించాలా లేక విక్రయించాలా అనే గందరగోళం చాలా మంది ఇన్వెస్టర్లలో కొనసాగుతూనే ఉంది.

సుజ్లాన్ ఎనర్జీ షేర్లు మార్చిలో తన కనిష్ఠ స్థాయి నుంచి 100% పైగా రాబడిని అందించింది. మార్చి 20న రూ.36.32 వద్ద ఉన్న షేర్ ధర ప్రస్తుతం రూ.75.83 వద్దకు చేరుకుంది. ఎనర్జీ షేర్లు ఒక సంవత్సరంలో 193% రాబడిని అందించాయి. రెండేళ్లలో 909% మల్టీబ్యాగర్ రాబడిని షేర్లు అందించాయి. అయితే గడచిన రెండు వారాల్లో కంపెనీ షేర్లు స్వల్ప పతనాన్ని చూశాయి. ఈరోజు ఉదయం 10.11 గంటల సమయంలో సుజ్లాన్ స్టాక్ ధర ఎన్ఎస్ఈలో 3.42 శాతం తగ్గి రూ.73.25 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.లక్ష కోట్లుగా ఉంది.

Brokerages gave new Targets for Suzlon Energy shares Know details

కంపెనీ షేర్లపై బ్రోకరేజీల అభిప్రాయాన్ని పరిశీలిస్తే.. సుజ్లాన్ ఎనర్జీ స్టాక్ విస్తృత నెలవారీ చార్ట్‌లో బుల్లిష్ మొమెంటం చెక్కుచెదరకుండా ఉంటుందని SAMCO సెక్యూరిటీస్ టెక్నికల్ అనలిస్ట్ ఓం మెహ్రా చెప్పారు. అలాగే నెలవారీ RSI 88 చుట్టూ తిరుగుతూ ఓవర్‌బాట్ పరిస్థితిని సూచిస్తుంది. ఇటీవలి ర్యాలీ తర్వాత ఒక చిన్న కరెక్షన్ ఊహించబడిందని మెహ్రా తెలిపారు. ఇన్వెస్టర్లు ప్రస్తుత సమయంలో కంపెనీ షేర్లను కొనుగోలు చేసి కూటబెట్టుకోవటానికి అనుకూలమైన అవకాశాన్ని అందిస్తుందన్నారు. దేశీయ మార్కెట్లలో ఎనర్జీ స్టాక్‌లు దృష్టిలో ఉన్నందున సుజ్లాన్ అదే బుల్లిష్ పథాన్ని అనుసరిస్తుందని భావిస్తున్నారు. ఏడాది చివరి నాటికి షేర్ ధర రూ.115కి చేరుకోవచ్చని బ్రోకరేజ్ అంచనా వేసింది.

ఇదే క్రమంలో స్టాక్ బాక్స్ టెక్నికల్ అనలిస్ట్ కుశాల్ గాంధీ మాట్లాడుతూ స్టాక్ ఇప్పటికీ ఓవర్‌బాట్ జోన్‌లో తక్కువగా ఉందని, ఇది గ్రీన్ ఎనర్జీ స్టాక్‌కు మరింత అప్‌సైడ్‌ని సూచిస్తుందన్నారు. సుజ్లాన్ ఎనర్జీ అనేది పునరుత్పాదక ఇంధన పరిష్కారాల వ్యాపారంలో ప్రధాన కంపెనీగా కొనసాగుతోంది. కంపెనీ విండ్ టర్బైన్ల ఉత్పత్తిదారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+