Suzlon Stock: ఏడాదిలో బలం చూపించిన సుజ్లాన్ స్టాక్.. కొత్త టార్గెట్ ధర చూస్తే షాకే.. డోన్ట్ మిస్..!!
Suzlon Energy Share: ప్రపంచ వ్యాప్తంగా గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీకి డిమాండ్ భారీగా పెరుగుతున్న వేళ ఆ రంగంలోని కంపెనీల షేర్లకు మహర్దశ పట్టిందని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు వీటిని పట్టించుకోని ఇన్వెస్టర్లు ప్రస్తుతం వాటిపై భారీగా బెట్టింగ్ వేస్తున్నారు. చాలా మంది తమ పోర్ట్ ఫోలియోలో వ్యూహాత్మకంగా ఈ రంగం షేర్లకు స్థానం కల్పిస్తున్నారు.
ఈ క్రమంలోనే భారతదేశానికి చెందిన విండ్ టర్బైన్ మేకింగ్ కంపెనీ సుజ్లాన్ ఎనర్జీ షేర్లు గడచిన ఏడాది కాలంగా తన సత్తా చాటుతున్నాయి. వరుసగా కంపెనీ భారీ ఆర్డర్ల పైప్ లైన్ సాధించటంతో మార్కెట్లో కంపెనీ షేర్లను అన్ని వర్గాల పెట్టుబడిదారుల నుంచి ఆసక్తి పెరుగుతోంది. ప్రధాన బ్రోకరేజ్ కంపెనీలు సైతం కంపెనీ షేర్లను తమ రాడార్లలో ఉంచుతూ ఎప్పటికప్పుడు టార్గెట్ ధరలను రివ్యూ చేస్తున్నాయి. ప్రస్తుత ర్యాలీని గమనిస్తుంటే సుజ్లాన్ షేర్లలో ఇప్పటికీ పెరుగుదలకు తగినంత అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది.

దీర్ఘకాలం నుంచి స్వల్ప కాలానికి కంపెనీ షేర్లను నమ్మి డబ్బు పెట్టిన ఇన్వెస్టర్లు ప్రస్తుతం ఆ ఫలాలను అందుకుంటున్నారు. గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీదే భవిష్యత్తు అని ముందుగానే పసికట్టిన ఇన్వెస్టర్లకు సుజ్లాన్ స్టాక్ ఒక సంవత్సరంలో 256 శాతానికి పైగా రాబడిని అందించింది. అలాగే గత 5 ఏళ్ల కాలంలో ఏకంగా 2800 శాతానికి పైగా మల్టీబ్యాగర్ గెయిన్స్ అందించింది. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్ నిపుణులు ఇప్పటికీ కంపెనీ షేర్లపై తమ బుల్లిష్ వ్యూ కొనసాగిస్తున్నారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లకు ఇష్టమైన ఉన్న సుజ్లాన్ స్టాక్ ఒక్కోటి దీర్ఘకాలంలో రూ.140 స్థాయికి చేరుకోవచ్చని వారు భావిస్తున్నారు.
ఎనర్జీ కంపెనీ షేర్లపై రెలిగేర్ బ్రోకింగ్ కు చెందిన నిపుణులు రవి సింగ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇది కాకుండా కంపెనీ తన రుణాన్ని తగ్గించుకుంది. ఈ ప్రయత్నం మెరుగైన ఆర్థిక ఆరోగ్యానికి దారితీయటంతో పాటు స్టాక్ ఆల్-టైమ్ గరిష్టాలకు చేరుకుందని అన్నారు. అలాగే ఇటీవల సుజ్లాన్ రాబడి, లాభం రెండింటిలోనూ అద్భుతమైన వృద్ధితో పాటు దాని అత్యధిక త్రైమాసిక EBITDAకి దారితీసిందని స్టాక్‌బాక్స్ రీసెర్చ్ అనలిస్ట్ సాగర్ శెట్టి అన్నారు.
స్వల్ప కాలికంగా షేర్లపై బెట్ వేయాలనుకునే ఇన్వెస్టర్లు 85-90 టార్గెట్ ధరగా ఉంచుకుని లాభాలను బుక్ చేసుకోవచ్చని ఛాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమీత్ బగాడియా పేర్కొన్నారు. సుజ్లాన్ ఎనర్జీ షేర్లను కలిగి ఉన్న పెట్టుబడిదారులు హోల్డ్ చేయాలని సూచించారు. ఈ షేర్ రూ.140 స్థాయి వరకు వెళ్లవచ్చని అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications