Vodafone Idea share: దేశీయంగా టెలికాం మార్కెట్లో ఒక వెలుగువెలిగిన సంస్థలు ఐడియా, వొడఫోన్. అయితే అంబానీ రాకతో ఇవి అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాయి. ఆ తర్వాత రెండు సంస్థలు కలిసి పనిచేయాలని నిర్ణయించినప్పటికీ అంబానీ దెబ్బకు భారీ నష్టాలతో సతమతమౌతున్నాయి. చాలా కాలం పోరాడిన తర్వాత ఇప్పుడు మెల్లగా కంపెనీ పరిస్థితులు కుదుటపడటం మెుదలుపెట్టాయి.
సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వొడాఫోన్ ఐడియా షేర్ల ధరలు భారీగా పతనమయ్యాయి. శుక్రవారం కంపెనీ షేర్లు రూ.10 దిగువన 52 వారాల కనిష్ఠ ధర రూ.9.79కి చేరాయి. అయితే కొద్ది సేపటికే రికవర్ అయిన టెలికాం స్టాక్ చివరికి 1 శాతం పెరుగుదలతో రూ.10.48 వద్ద స్థిరపడింది. సుప్రీం కోర్టు నిర్ణయం తర్వాత బ్రోకరేజ్ సంస్థ నువామా మాత్రమే వొడాఫోన్ ఐడియా షేర్లపై బుల్లిష్ వ్యూ ప్రకటించింది. కంపెనీ వ్యవహారంలో సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం(AGR)లో ఆరోపించిన లోపాలను సరిదిద్దాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌లను సుప్రీంకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే.

నష్టాల్లో కొనసాగుతున్న టెలికాం దిగ్గజానికి ప్రభుత్వ మద్దతు ఉందని బ్రోకరేజ్ సంస్థ తన నోట్స్‌లో పేర్కొంది. వొడాఫోన్ ఐడియా తన బ్యాడ్ ఫేజ్‌ను వదిలిపెట్టిందని బ్రోకరేజ్ హౌస్ అభిప్రాయపడింది. మీడియం నుంచి లాంగ్ టర్మ్‌లో రూ.15 స్థాయికి చేరుకోవచ్చని బ్రోకరేజ్ వెల్లడించింది. ఈ బ్రోకరేజ్ నోమురా ఇండియా గతంలో కంపెనీ షేర్లకు అందించిన 'న్యూట్రల్' రేటింగ్‌కి వ్యతిరేకంగా స్టాక్‌పై 'BUY' రేటింగ్ అందించింది. రానున్న కాలంలో కంపెనీ షేర్ల ధరలు రూ.15 స్థాయికి చేరుకోవచ్చని టార్గెట్ ధరను ప్రకటించింది.
సుప్రీం కోర్టు తీర్పును పరిశీలిస్తే.. ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బి.ఆర్.క్యూరేటివ్ పిటిషన్లను ఓపెన్ కోర్టులో విచారణకు లిస్టింగ్ చేయాలంటూ టెలికాం కంపెనీల విజ్ఞప్తిని కూడా గవాయ్ ధర్మాసనం తోసిపుచ్చింది. క్యురేటివ్ పిటిషన్ అనేది సుప్రీంకోర్టులో చివరి ప్రయత్నం ఆ తర్వాత ఈ కోర్టును ఆశ్రయించడానికి చట్టపరమైన మార్గం లేదు. క్యూరేటివ్ పిటిషన్ వోడాఫోన్ ఐడియా దాఖలు చేసిన AGR బకాయిలపై 2019 తీర్పును పునఃపరిశీలించాలని కోరింది. వొడాఫోన్ ఐడియా ఇంతకుముందు రూ.70,300 కోట్ల AGR బాధ్యతను నివేదించింది. కంపెనీ అంచనా ప్రకారం AGR చెల్లింపుల బాధ్యత 50 శాతం తక్కువగా రూ.35,400 కోట్లుగా ఉంది.
సోమవారం చర్చ..
కంపెనీ బీఎస్ఈ ఫైలింగ్స్ ప్రకారం.. ఇటీవలి పరిణామాలపై నవీకరణను అందించడానికి సోమవారం అంటే సెప్టెంబర్ 23, 2024 నాడు మధ్యాహ్నం 2.30 నుంచి 3 గంటల వరకు దాని సీనియర్ మేనేజ్‌మెంట్‌తో కాన్ఫరెన్స్ కాల్‌ని నిర్వహిస్తుంది. కాన్ఫరెన్స్ కాల్ కోసం కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ అక్షయ మూంద్రా, సీనియర్ మేనేజ్‌మెంట్ టీమ్ మద్దతుతో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ శ్రీ మూర్తి జీవీఎఎస్‌గా వ్యవహరిస్తారని వెల్లడైంది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications