Stock Sugessions: బ్రోకరేజ్ సంస్థలు మంచి పనితీరును కనబరిచే కొన్ని షేర్లను ఇన్వెస్టర్లు దృష్టిలో ఉంచుకోవాలని సూచిస్తుంటాయి. అయితే ఈ సారి వారి కన్ను ప్రభుత్వ యాజమాన్య కంపెనీలపై పడింది.
ప్రభుత్వ రంగ స్టాక్స్‌లో ఈ బూమ్‌కి మంచి పనితీరుతో సూచీలు లాభపడటమే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో బలమైన ఫండమెంటల్స్ ఉన్న రెండు షేర్లను సిఫార్సు చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ప్రభుదాస్ లిల్లాధర్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్.., ఆనంద్ రాఠీ స్టాక్ బ్రోకింగ్ NTPC షేర్లకు BUY రేటింగ్ ఇచ్చాయి.

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ స్టాక్:
దేశంలోని రక్షణ రంగానికి చాలా కీలకమైన సంస్థల్లో ఒకటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL). 1964లో ప్రారంభమైన ఈ సంస్థ స్వదేశీ యుద్ధ విమానాల తయారీదారుగా ఉంది. అలాగే దేశంలోని రక్షణ రంగానికి విమానయాన సేవలను అందిస్తుంది. HAL విమానాలు, హెలికాప్టర్లు, ఏరో ఇంజన్లు, ఇతర పరికరాలను డిజైన్, తయారీ, మరమ్మత్తు కార్యకలాపాలను చేపడుతుంది.
దేశీయ బ్రోకరేజ్ సంస్థ ప్రభుదాస్ లిల్లాధర్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ షేర్లకు BUY రేటింగ్ అందించింది. దీనికోసం రూ.2,266ను టార్గెట్ ధరగా ప్రకటించింది. ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్టాక్ ధర రూ.1,957 కంటే దాదాపు 15 శాతం అధికం. సైనిక విమానాల సరఫరాదారుగా పెరుగుతున్న భారత బలం, ఆధునీకరణ హెచ్‌ఏఎల్‌కు ప్రయోజనకరంగా ఉందని బ్రోకరేజ్ తన నివేదికలో వెల్లడించింది.
ఎన్‌టీపీసీ స్టాక్:
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(NTPC) అనేది కన్సల్టెన్సీ, పవర్ ట్రేడింగ్, శిక్షణ, గ్రామీణ విద్యుదీకరణ, బొగ్గు మైనింగ్ వంటి విద్యుత్ సంబంధిత కార్యకలాపాలను చేపడుతున్న ప్రభుత్వ రంగ సంస్థ. మార్చి 31, 2023 నాటికి దేశంలోని మొత్తం విద్యుత్ డిమాండ్‌లో 25 శాతాన్ని NTPC తీరుస్తుంది.
ఈ క్రమంలో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ఆనంద్ రాఠీ ఎన్‌టీపీసీ షేర్లకు BUY రేటింగ్ ప్రకటించింది. షేరుకు రూ.300 టార్గెట్ ధరగా నిర్ణయించింది. ఇది ప్రస్తుతం మార్కెట్లో స్టాక్ ధర రూ.241 కంటే 24 శాతం అధికంగా ఉంది. గడచిన మూడు నెలల్లో ఎన్‌టీపీసీ స్టాక్‌లో 26.12 శాతం లాభపడింది. అలాగే 2023లో ఇప్పటివరకు స్టాక్ 44.91 శాతం పెరిగింది.


Click it and Unblock the Notifications