Page Industries: లక్షలను కోట్లుగా మార్చుకోవాలంటే స్టాక్ మార్కెట్లో కావాల్సింది సరైన పెట్టుబడి నిర్ణయాలతో పాటు ఓపిక. సరైన కంపెనీల్లో పెట్టుబడిదారులు తమ డబ్బును దీర్ఘకాలం కొనసాగిస్తే సూపర్ లాభాలను అందుకుంటారని పేజ్ ఇండస్ట్రీస్ షేర్లు మరోసారి నిరూపించాయి.
ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు బ్రాండెడ్ ఇన్నర్‌వేర్ తయారీ కంపెనీ పేజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు ఒక శాతానికి పైగా పడిపోయాయి. దీంతో నేడు కారణంగా షేరు రూ.34,066 స్థాయికి పడిపోయింది. బీఎస్ఈలో షేరు 52 వారాల గరిష్ఠ ధర రూ.43,599 గత ఏడాది మే నెలలో రికార్డ్ అయ్యింది. అలాగే కంపెనీ షేర్ల 52 వారాల కనిష్ఠ ధర రూ.33,100గా ఉంది. పేజ్ ఇండస్ట్రీస్ కంపెనీ ఐపీవో 2007లో స్టాక్ మార్కెట్‌లోకి అరంగేట్రం చేసింది. అప్పట్లో ఒక్కో షేరు ధర రూ.395గా నిర్ణయించింది.

ప్రముఖ బ్రోకరేజ్ UBS పేజ్ ఇండస్ట్రీస్ షేర్లపై 'BUY' రేటింగ్ ఇచ్చింది. ఈ షేర్ ధర రూ.44,000కు చేరుతుందని బ్రోకరేజ్ అంచనా వేసింది. పేజ్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ల బోర్డు సమావేశం 23 మే 2024న షెడ్యూల్ చేయబడింది. సమావేశంలో కంపెనీ గడచిన ఆర్థిక సంవత్సరానికి 4వ మధ్యంతర డివిడెండ్ ప్రకటనను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం కంపెనీలో ప్రమోట్రలు అత్యధికంగా 45.11 శాతం వాటాలను కలిగి ఉన్నారు. ఇదే క్రమంలో ఎఫ్‌ఐఐలు 20.86 శాతం, మ్యూచువల్ ఫండ్స్ 19.27 శాతం వాటాలను హోల్డ్ చేస్తున్నాయి.
కంపెనీ వ్యాపారాన్ని పరిశీలిస్తే ఇది ఇన్నర్‌వేర్, లాంజ్‌వేర్, సాక్స్‌ల తయారీ రిటైలింగ్‌లో కంపెనీ ప్రముఖమైనది. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన జాకీ బ్రాండ్ ఉత్పత్తులను ఇండియాలో పేజ్ ఇండస్ట్రీస్ లైసెన్స్ కింద ఉత్పత్తి, పంపిణీ, మార్కెటింగ్ నిర్వహిస్తోంది. అలాగే స్విమ్‌వేర్ కోసం అంతర్జాతీయ బ్రాండ్ అయిన స్పీడో సంస్థ నుంచి ఉత్పత్తి లైసెన్స్ కలిగి ఉంది.


Click it and Unblock the Notifications