ITC Q2 Results: అంచనాలను మించి ఐటీసీ లాభాలు.. పెరిగిన సిగరెట్ బిజినెస్..
ITC Q2 Results: ఇండియా టొబ్యాకో కింగ్ అంటే అందరికీ గుర్తొచ్చేది ఐటీసీ. ఎందుకంటే ఆ వ్యాపారంలో కంపెనీ అనేక సంవత్సరాలుగా ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే కంపెనీ ఎఫ్ఎమ్సీజీ రంగంలో కూడా బలమైన ముద్రను కలిగి ఉంది.
కంపెనీ గురువారం తన సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాను విడుదల చేసింది. రెండవ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం మార్కెట్ అంచనాలకు మించి 10 శాతం వృద్ధిని నమోదు చేసింది. అలాగే క్వార్టర్ లో కంపెనీ ఆదాయం రూ.16,550గా నమోదైంది. గత సంవత్సరం ఇదే కాలంలో ఐటీసీ ఆదాయం రూ.16,129.9 కోట్లుగా నిలిచింది.

సిగరెట్ వ్యాపారం నుంచి ITC ఆదాయం రూ.6,953 నుంచి సంవత్సరానికి 10.13% పెరిగి రూ.7,657గా నిలిచింది. ఇదే క్రమంలో FMCG వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం 8.35% పెరిగి రూ.5,293 కోట్లకు చేరుకుంది. ఇక హోటల్స్ వ్యాపారంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపధికన 21.31% పెరిగి రూ.649 కోట్లుగా నిలిచింది. స్టేషనరీ వ్యాపారంలో క్లాస్‌మేట్ నోట్‌బుక్స్, పెన్నులు ఏడాది ప్రాతిపదికన బలమైన వృద్ధిని సాధించాయి. అలాగే ఉత్పత్తి సామర్థ్యాలు పెంచడం ద్వారా ఎగుమతులు పెరుగుతున్నాయి. అగ్రి, పేపర్‌బోర్డ్ విభాగాలు బలహీనంగా ఉన్నాయి.
ఈరోజు స్టాక్ మార్కెట్లో ఐటీసీ స్టాక్ 1.14 శాతం నష్టపోయి రూ.445.30 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. సెప్టెంబర్ త్రైమాసికంలో హోటల్స్-టు-సిగరెట్ సమ్మేళనం ఆరోగ్యకరమైన ఆదాయాన్ని నివేదించటంతో బ్రోకరేజీలు కంపెనీపై సానుకూల ధృక్పదాన్ని కలిగి ఉన్నాయి.


Click it and Unblock the Notifications