Defence Stocks: గడచిన కొన్ని నెలలుగా దేశీయ స్టాక్ మార్కెట్లలో డిఫెన్స్ రంగానికి చెందిన అనేక కంపెనీల షేర్లు భారీ ర్యాలీని నమోదు చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి కేంద్రం దేశీయంగా కొనుగోళ్లతో పాటు ఎగుమతుల ప్రోత్సాహం వంటి చర్యలతో ఈ రంగంలోని కంపెనీలు లాభపడ్డాయి. అలాగే బడ్జెట్లో డిఫెన్స్ స్పెండింగ్ సైతం ఈ రంగాన్ని ప్రభావితం చేస్తాయి.
ప్రస్తుతం మోదీ సర్కార్ ముచ్చటగా మూడోసారి సైతం అధికారంలోకి రావటం డిఫెన్స్ స్టాక్ ఇన్వెస్టర్లకు లాభాలను తెచ్చిపెట్టవచ్చని అంచనాలు ఉన్నాయి. జూలై 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొలి పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో ఆమె ప్రసంగం నుంచి అత్యధిక అంచనాలను కలిగి ఉన్న రంగాల జాబితాలో డిఫెన్స్ కూడా ఒకటి. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది.

దీనికి ముందు ఫిబ్రవరిలో కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ప్రసంగం ప్రకారం కేంద్ర ఆర్థిక మంత్రి రక్షణ శాఖకు రూ.6.21 లక్షల కోట్లను కేటాయించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఇది గత ఏడాది పూర్తి స్థాయి బడ్జెట్ కంటే 4.3 శాతం అధికం. అయితే ప్రస్తుతం ప్రవేశపెట్టనున్న పూర్తి బడ్జెట్‌లో మధ్యంతర బడ్జెట్ విస్తరణ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బడ్జెట్ ప్రసంగం తర్వాతి నుంచి ఇప్పటి వరకు ఈ ఏడాది డిఫెన్స్ స్టాక్స్ తమ బుల్ ర్యాలీని నిరంతరాయంగా కొనసాగించాయి. ఈ క్రమంలో గత నెలలో ఏకంగా 56 శాతం పెరుగుదలను చూశాయి.
ముఖ్యంగా GRSE స్టాక్ 60 శాతం, మజ్‌గావ్ డాక్ షేర్లు 43 శాతం లాభపడి అత్యధిక పెరుగుదలను నమోదు చేశాయి. అలాగే పరాగ్ డిఫెన్స్ కంపెనీ షేర్లు గత నెలలో 22 శాతం పెరిగాయి. కొచ్చిన్ షిప్‌యార్డ్ స్టాక్ సైతం ఇన్వెస్టర్లకు అద్భుతమైన రాబడిని అందించింది. ఈ క్రమంలో బ్రోకరేజ్ సంస్థ షేర్‌ఖాన్ HAL, BEL, భారత్ ఫోర్జ్ షేర్లపై తన బులిష్ వ్యూహాన్ని వెల్లడించింది. అలాగే BEML, MDL, BDL, GRSE, డేటా ప్యాటర్న్, కొచ్చిన్ షిప్‌యార్డ్ షేర్లను వాచ్ లిస్ట్ లో ఉంచుకోవాలని సూచించింది. ఈ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఈ రంగాల షేర్లు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications