Paytm News: ప్రస్తుతం మార్కెట్లో పేటీఎం కంపెనీ షేర్లపై ఇన్వెస్టర్లు ఎక్కువగ దృష్టి సారిస్తున్నారు. వాస్తవానికి సీఈవో శర్మకు సెబీ నోటీసుల తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి శుభవార్త వచ్చింది.
ఫిన్‌టెక్ తన చెల్లింపు సేవా వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి ఆమోదం పొందింది. ఇప్పుడు కంపెనీ తన లైసెన్స్‌ను తిరిగి పొందడానికి మళ్లీ దరఖాస్తు చేయాలని యోచిస్తోంది. ఈ కాలంలో కంపెనీ తన ప్రస్తుత భాగస్వాములకు సేవలను అందించడం కొనసాగిస్తుంది. ఈ పరిణామాలు కంపెనీ తిరిగి పుంజుకుంటుందనే ఆశావాదాన్ని ఇన్వెస్టర్లలో కలిగిస్తోంది. ఈ క్రమంలో రానున్న కాలంలో పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ షేర్లు 3 రెట్లు పెరిగి రూ.1,444కి చేరుకోవచ్చని బ్రోకరేజ్ సంస్థ వెంచురా సెక్యూరిటీస్ తన రీసెర్చ్ నోట్ లో వెల్లడించింది.

ఇక రాబడి గురించి బ్రోకరేజ్ వెల్లడిస్తూ రాబోయే 24 నెలల్లో స్టాక్ రెండింతలు రూ.1,170కి చేరుకోవచ్చని పేర్కొంది. ఈ క్రమంలో ఒక్కో పేటీఎం షేర్ ధరకు రూ.1,444 టార్గెట్ ధరగా నిర్ణయించింది. ఈ క్రమంలో నేడు స్టాక్ ధర రూ.559 రేటు వద్ద ప్రారంభమైనప్పటికీ.. 10.18 గంటల సమయంలో రూ.542.35 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. బ్రోకరేజ్ ప్రకారం బేర్ కేసు అంచనాలతో కూడా, వెంచురా రూ.870 స్థాయికి చేరుకుంటుందని పేర్కొంది.
వాస్తవానికి ఈ ఏడాది ప్రారంభంలో వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్బీఐ కఠిన ఆంక్షలు విధించింది. ఇది కంపెనీకి వ్యాపారంతో పాటు ఆదాయాల పరంగా పెద్ద దెబ్బతీసింది. ఆ సమయంలో మర్చంట్ అకౌంట్ హోల్డర్లు సైతం కంపెనీని భారీగా వీడిన సంగతి తెలిసిందే. వెంచురా అంచనాల ప్రకారం FY24-27లో పేటీఎం ఆదాయం 14.1 శాతం CAGR వద్ద రూ.14,531 కోట్లకు పెరుగుతుందని, సర్వీసెస్ లాభం 15.6 శాతం పెరిగి రూ.8,301 కోట్లకు చేరుతుందని, ప్రీ-ఈఎస్‌ఓపీ EBITDA 54.5 శాతం పెరిగి రూ.1,829 కోట్లకు చేరుతుందని పేర్కొంది.


Click it and Unblock the Notifications