Adani Power Shares: ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఎవరు ఏమన్నా గడచిన కొన్నేళ్లుగా గౌతమ్ అదానీ నేతృత్వంలోని లిస్టెడ్ స్టాక్స్ ముందుకు సాగుతూనే ఉన్నాయి. అందుకే చాలా మంది అదాని గ్రూప్ కంపెనీలపై పందెం వేసేందుకు ఒక అడుగు ముందుగానే ఉంటున్నారు. చాలా మంది ఇప్పటికే అదానీ కంపెనీల్లో ఒడిదొడుకులు ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో మంచి రాబడులను అందుకున్న సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది అదానీ పవర్ కంపెనీ షేర్ల గురించే. రానున్న కాలంలో కంపెనీ షేర్లు భారీగా పెరిగే అవకాశం ఉందని బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ముందుగా వెంచురా సెక్యూరిటీస్ తమ బుల్లిష్ వ్యూహాన్ని కొనసాగిస్తూ పవర్ షేర్లకు BUY రేటింగ్ అందించింది. కంపెనీ షేర్లను కొనుగోలు చేయాలని సూచించింది. శుక్రవారం మార్కెట్ల ముగింపు సమయంలో ఎన్ఎస్ఈలో ఒక్కోటి రూ.515.50 వద్ద స్థిరపడింది.

ఇదే క్రమంలో కంపెనీ షేర్ల 52 వారాల గరిష్ఠ ధర రూ.895.85 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.432గా ఉంది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపు రూ.2 లక్షల కోట్లకు సమీపంలో ఉంది. వెంచురా సెక్యూరిటీస్ మాత్రం కంపెనీ షేర్లు భవిష్యత్తులో ఒక్కోటి రూ.806 స్థాయికి చేరుకుంటాయని ప్రకటించింది. వాస్తవానికి ఇది స్టాక్ ప్రస్తుత ధర కంటే దాదాపు 57 శాతం అధికంగా ఉంది. అదానీ గ్రూప్ తన విద్యుత్ ఉత్పాదకత సామర్థ్యాన్ని 2031 ఆర్థిక సంవత్సరం నాటికి 30.67 గిగావాట్లకు చేర్చే లక్ష్యంతో ముందుకు సాగటం షేర్లకు కలిసొచ్చే అంశంగా ఉంది.
స్టాక్ ధర పెరగటానికి కారణం?
అతిపెద్ద ప్రైవేట్ థర్మల్ పవర్ ప్రొడ్యూసర్ అయిన అదానీ పవర్ లిమిటెడ్, గణనీయమైన విద్యుత్ డిమాండ్‌ను తీర్చడానికి బలమైన సామర్థ్య విస్తరణ ప్రణాళికలతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోందని వెంచురా సెక్యూరిటీస్ తన నోట్‌లో పేర్కొంది. అలాగే దేశంలో తయారీ కార్యకలాపాలు పెరగడం, ఇళ్లలో వైట్ గూడ్స్, గాడ్జెట్‌లకు ఆదరణ పెరగడం వల్ల దేశంలో విద్యుత్ డిమాండ్ నిరంతరం పెరుగుతూనే ఉందని నివేదికలో పేర్కొంది. ఇది పవర్ రంగంలో అదానీకి పెద్ద ఆటగాడిగా మంచి ఆదాయ అవకాశాలను అందిస్తుందని వెంచురా భావిస్తోంది.
రెన్యూవబుల్ ఎనర్జీ ఊహించిన స్థాయిలో పెరగకపోవటం వల్ల పెరుగుతున్న డిమాండ్ తీర్చటానికి థర్మల్ పవర్ పై ఆధారపడాల్సిన పరిస్థితులు ఎక్కువైనట్లు బ్రోకరేజ్ వెల్లడించింది. పెరుగుతున్న డిమాండ్-సరఫరా అంతరం బేస్ లోడ్ థర్మల్ పవర్ సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది. అలాగే అదానీ పవర్ థర్మల్ పవర్ కెపాసిటీలో నిరంతర పెట్టుబడి ద్వారా భవిష్యత్ వృద్ధికి కట్టుబడి ఉండటం షేర్లలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు మంచి విలువను అందిస్తుందని బ్రోకరేజ్ వెల్లడించింది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధర పెరగడంతో వినియోగదారులు కొత్త స్కెచ్.. రూ.4 లక్షల కోట్లు దాటిన పసిడి రుణాలు..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బెంగళూరు-హైదరాబాద్ మధ్య ప్రయాణం గంటలే.. 110 కి.మీ.వేగంతో కొత్త రైలు వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..

బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే.. 11 ఇంటర్‌ఛేంజెస్ కనెక్టివిటితో బిజినెస్ కారిడార్ రెడీ..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications