Stock Tips: పేలటానికి సిద్ధంగా స్మాల్ క్యాప్ స్టాక్.. డబ్బులు డబుల్ చేసే స్టాక్..!!
Investment Tips: గడచిన కొన్ని నెలలుగా దేశంలో ఇన్వెస్టర్లు ఎక్కువగా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కంపెనీ షేర్లపైనే ఎక్కువగా తమ పెట్టుబడులను కొనసాగిస్తున్నారు. దీంతో ఈ సెగ్మెంట్ షేర్లలో భారీ ర్యాలీ కొనసాగుతోంది.
దేశీయ స్టాక్ మార్కెట్లో వేల సంఖ్యలో లిస్టెడ్ కంపెనీల షేర్లు ఉన్నప్పటికీ.. వీటిలో మంచి పనితీరును కనబరిచేవి వందల సంఖ్యలోనే ఉంటాయి. ఈ క్రమంలోనే బ్రోకరేజ్ సంస్థ వెంచురా సెక్యూరిటీస్ స్మాల్ క్యాప్ కంపెనీ అయిన స్వాన్ ఎనర్జీపై తన ఆసక్తిని ప్రకటించింది. ఈ స్టాక్ గడచిన నెలరోజుల్లో ఇన్వెస్టర్లకు 45 శాతం మేర రాబడిని అందించింది. పైగా రానున్న 2 ఏళ్లలో షేరు ధర మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

స్వాన్ ఎనర్జీ అనేది భారతీయ కంపెనీ. ఇది టెక్స్‌టైల్స్, రియల్ ఎస్టేట్, ఎనర్జీ అండ్ పెట్రోకెమికల్స్ సహా వివిధ వ్యాపారాల్లో ఉనికిని కలిగి ఉంది. ప్రస్తుతం స్టాక్ ధర మార్కెట్లో దాదాపు రూ.434 స్థాయిలో ఉంది. అయితే స్టాక్ బ్రోకరేజ్ సంస్థ వెంచురా సెక్యూరిటీస్ కంపెనీ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సూచించింది. దీనికోసం షేర్ టార్గెట్ ధరను రూ.800గా నిర్ణయించింది. స్వాన్ ఎనర్జీ మూలధన వ్యయాలను చేయడం ద్వారా వృద్ధి బాటలో పయనిస్తోంది. కంపెనీ ఇటీవల రూ.2,133 కోట్ల ఎన్‌సీఎల్‌డీని సమీకరించింది.
స్వాన్ ఎనర్జీ ఇటీవల వేలం ద్వారా రిలయన్స్ నేవల్ అండ్ ఇంజినీరింగ్ లిమిటెడ్‌ను కొనుగోలు చేసింది. ఇది షిప్ రిపేర్, బిల్డింగ్ అండ్ బ్రేకింగ్ బిజినెస్‌లో కంపెనీ వ్యూహాత్మక పెట్టుబడులకు అద్దం పడుతోందని బ్రోకరేజ్ పేర్కొంది. అలాగే స్వాన్ ఎనర్జీ అనుబంధ సంస్థ స్వాన్ ఎల్‌ఎన్‌జీ 20 ఏళ్ల టేక్-ఆర్-పే కాంట్రాక్ట్‌ల కింద ప్రధాన చమురు, గ్యాస్ కంపెనీలు, రిఫైనరీల నుంచి సంవత్సరానికి 45 లక్షల మెట్రిక్ టన్నుల కెపాసిటీ బుకింగ్‌లను బుక్ చేసింది.


Click it and Unblock the Notifications