Hindustan Zinc Stock: ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు దీపావళి ట్రేడింగ్ కోసం రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో సరైన పెట్టుబడి నిర్ణయాల కోసం చాలా మంది బ్రోకరేజీల రిపోర్టులను పరిశీలించే పనిలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు వేదాంతాకు చెందిన ఒక కంపెనీ షేర్లు అందరినీ ఆకర్షిస్తున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది వేదాంత గ్రూప్ కంపెనీ అయిన హిందుస్థాన్ జింక్ కంపెనీ షేర్ల గురించే. తాజాగా కంపెనీ తన సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. రెండవ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 34.5 శాతం పెరిగి రూ.2,327 కోట్లకు చేరుకుంది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం కేవలం రూ.1,729 కోట్లుగా ఉంది. ఇదే క్రమంలో సెప్టెంబరు త్రైమాసికంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన రూ.7,014 కోట్ల నుంచి రూ.8,522 కోట్లకు పెరిగింది. ఈ క్రమంలో కంపెనీ వెండి ద్వారా రూ.1,550 కోట్ల ఆదాయాన్ని పొందగా, ఇతర ఖనిజాల ద్వారా రూ.6,403 కోట్లను ఆర్జించింది.

కంపెనీ భారీ లాభాలను చూసిన తర్వాత బ్రోకరేజీలు సైతం ఈ కంపెనీ షేర్లపై తమ దృష్టిని సారించాయి. హిందుస్థాన్ కంపెనీ షేర్లు ఈవారం చివరి రోజున ఒక్కోటి రూ.507.50 రేటు వద్ద స్థిరపడ్డాయి. ఈ క్రమంలో దేశీయ బ్రోకరేజ్ సంస్థ ఆనంద్ రాఠీ కంపెనీ షేర్లను దీపావళికి కొనుగోలు చేసేందుకు అనుకూలంగా ఉన్నాయంటూ BUY సిఫార్సును అందించింది. ఈ క్రమంలో బ్రోకరేజ్ కంపెనీ షేర్ల టార్గెట్ ధరను రూ.680-750గా నిర్ణయించింది. ఇదే క్రమంలో షేర్లకు స్టాప్ లాస్ ధరను రూ.380గా ప్రకటించింది.
ప్రస్తుతం కంపెనీ ప్రపంచంలో రెండవ అతిపెద్ద జింక్ ఉత్పత్తిదారుగా కొనసాగుతోంది. అలాగే వెండి ఉత్పత్తిలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఉత్పత్తిదారు స్థానాన్ని పొందింది. ఇదే క్రమంలో కంపెనీ బోర్డు సెరెంటికా రెన్యూవబుల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (SRIPL) లేదా దాని అనుబంధ సంస్థల్లో కనీసం 26 శాతం వాటా కొనుగోలుకు రూ.327 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు శుక్రవారం ఆమోదం తెలిపింది. హిందూస్థాన్ జింక్ దీర్ఘకాలిక విద్యుత్ అవసరాలను తీర్చడానికి పునరుత్పాదక ఇంధన విద్యుత్ ప్రాజెక్టును అమలు చేయడానికి సెరెంటికా రెన్యూవబుల్ స్థాపించబడింది.
Note: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications