Stocks to Buy: 18 శాతం పెరగనున్న 4 స్టాక్స్.. 'BUY' రేటింగ్ ఇచ్చిన బ్రోకరేజీ..
Stocks to Buy: దేశంలో ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయి కంటే వర్షాలు తక్కువగా నమోదవుతున్నాయి. ఇది ఆహార పదార్థాల ధరలపై ప్రభావాన్ని చూపుతోంది. ఈ క్రమంలో కొన్ని కంపెనీల షేర్లు మార్కెట్లో భారీగా ర్యాలీని నమోదు చేస్తున్నాయి.
అవును చక్కెర స్టాక్స్ ఇన్వెస్టర్లకు తియ్యటి లాభాలను అందించేందుకు సిద్ధమౌతున్నాయి. రుతుపవనాల లోపంతో దేశంలో చక్కెర ధరలు ఆరేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. చక్కెర ప్రధాన ఉత్పత్తి రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలో దిగుబడులు పడిపోవటంతో చక్కెర స్టాక్స్ భారీ లాభాలను నమోదు చేశాయి. ఇదే క్రమంలో దేశీయ అవసరాలకు తగినంత నిల్వలు ఉన్నట్లు కేంద్రం హామీ ఇచ్చింది.

చక్కెర ధరలు పెరగడంతో ఈ రంగానికి చెందిన టాప్ స్టాక్‌లను కొనుగోలు చేయాలని ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ DAM క్యాపిటల్ సూచించింది. చక్కెర ఉత్పత్తి 33.5 మిలియన్ టన్నులకు పడిపోతుందని ఇది అంచనా వేసింది. ఈ క్రమంలోనే నాలుగు కంపెనీల షేర్లకు కొనుగోలు రేటింగ్ అందించింది.
ముందుగా చక్కెర తయారీలో ఉన్న త్రివేణి ఇంజినీరింగ్ అండ్ ఇండస్ట్రీస్ కంపెనీ.. పవర్ ట్రాన్స్‌మిషన్, మురుగునీటి శుద్ధి వంటి రంగాల్లో వ్యాపారాలను కలిగి ఉంది. ప్రస్తుతం రూ.374 వద్ద ఉన్న స్టాక్ రానున్న కాలంలో రూ.415 చేరుకోవచ్చని బ్రోకరేజ్ వెల్లడించింది. దీని తర్వాత దాల్మియా భారత్ షుగర్ అండ్ ఇండస్ట్రీస్ ధర రూ.463 నుంచి 16 శాతం పెరిగి రూ.540 చేరుకోవచ్చని చెబుతూ బై రేటింగ్ ఇచ్చింది. ఈ కంపెనీ పవర్, ఇండస్ట్రియల్ ఆల్కహాల్, రిఫ్రాక్టరీ రంగాల్లో సైతం వ్యాపారాలను నిర్వహిస్తోంది.
ఇక బ్రోకరేజ్ రాడార్లో ఉన్న మూడో కంపెనీ బలరాంపూర్ షుగర్ మిల్స్. దేశంలోని ఇథనాల్ సామర్థ్యంతో అతిపెద్ద చక్కెర కంపెనీల్లో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ స్టాక్ ధర రూ.433 వద్ద ఉండగా.. రానున్న కాలంలో రూ.510కి చేరుకుంటుందని తెలుస్తోంది. చివరగా ఇన్వెస్టర్లు పరిగణించదగిన షేర్లలో ద్వారకేష్ షుగర్ ఇండస్ట్రీస్ స్టాక్ కూడా ఉంది. ప్రస్తుతం స్టాక్ ధర రూ.102 వద్ద ఉండగా సమీప కాలంలో రూ.120ని తాకొచ్చని బ్రోకరేజ్ అంచనా వేస్తూ నాలుగు షేర్లకు BUY రేటింగ్ అందించింది.
Note: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని అనుకరించి ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవద్దు. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించి ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు తీసుకోండి.


Click it and Unblock the Notifications