Investment Tips: ఇజ్రాయెల్-గాజా యుద్ధం మార్కెట్లను గజగజలాడిస్తోంది. గతవారం మెుదట్లో అలాగే చివరి రోజున దీనికి సంబంధించిన ఇన్వెస్టర్ల ఆందోళనలతో మార్కెట్లు నష్టాలను నమోదు చేశాయి.
దీనికి అమెరికా ద్రవ్యోల్బణం అంచనాలకు మించి ఉండటం కూడా ప్రధాన కారణంగా వెల్లడైంది. ఇలాంటి పరిస్థితుల్లో స్థిరత్వాన్ని కొనసాగించి లార్జ్ క్యాప్ బ్లూచిప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ఉత్తమంగా చెప్పుకోవచ్చు. ప్రముఖ దేశీయ బ్రోకరేజ్ సంస్థ ప్రభుదాస్ లిల్లాధర్ పెట్టుబడిదారులకు 5 స్టాక్స్ కొనుగోలుకు సూచించింది.

ముందుగా ఏబీబీ ఇండియా కంపెనీ గురించి పరిశీలిస్తే.. ఇదొక పవర్ ప్రొడక్ట్స్, పవర్ సిస్టమ్, ఆటోమేషన్ ప్రొడక్ట్స్, ప్రాసెస్ ఆటోమేషన్ & రోబోటిక్స్ ఉత్పత్తులను తయారు చేసే సంస్థ. బ్రోకరేజీ సంస్థ ప్రభుదాస్ లిల్లాధర్ స్టాక్‌పై రూ.5,013 ధర టార్గెట్‌గా ఉంది. 2023లో ఇప్పటివరకు ఈ స్టాక్ 57.14 శాతం రాబడిని అందించింది. ఈ కంపెనీ ఆటోమేషన్ అండ్ పవర్ రంగంలో వ్యాపారాన్ని కొనసాగిస్తోంది.
బ్రోకరేజ్ ఎంచుకున్న రెండవ స్టాక్ అవెన్యూ సూపర్ మార్ట్స్. ఇది ప్రముఖ ఇన్వస్టర్, వ్యాపారి రాధా కిషన్ దమానీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా డీమార్ట్ పేరుతో రిటైల్ స్టోర్లను నిర్వహిస్తోంది. బ్రోకరేజ్ సంస్థ అవెన్యూ సూపర్‌మార్ట్ షేర్ల టార్గెట్ ధర రూ.4,576గా నిర్ణయించింది. దీని తర్వాత బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ షేర్లను బ్రోకరేజ్ రాడార్ లో ఉన్నాయి. బ్యాంక్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,825 నగరాల్లో 7,895 శాఖలను నిర్వహిస్తోంది. ప్రభుదాస్ లిల్లాధర్ స్టాక్‌పై రూ.2,025 టార్గెట్ ధరగా ప్రకటించింది.
దీని తర్వాత మరో రెండు బ్యాంకింగ్ రంగం షేర్లపై బ్రోకరేజ్ బులిష్ వ్యూ కలిగి ఉంది. ముందుగు ప్రభుత్వ యాజమాన్యంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రోకరేజ్ ఎంచుకుంది. దేశవ్యాప్తంగా 48 కోట్ల మంది ఖాతాదారులను కలిగి ఉన్న ఎస్బీఐ షేర్లకు రూ.770 టార్గెట్ ధరగా నిర్ణయించింది. ఇది ప్రస్తుతం మార్కెట్లోకి ధర కంటే దాదాపు 30 శాతం అధికం. చివరిగా పెట్టుబడిదారులు పరిగణలోకి తీసుకోవాల్సిన స్టాక్ ఐసీఐసీఐ బ్యాంక్. ICICI బ్యాంక్ 6,074 శాఖలు, 16,731 ATMల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. బ్రోకరేజీ షేరుకు రూ.1,180 టార్గెట్ ధరగా నిర్ణయించింది.
Note: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇవి పూర్తిగా బ్రోకరేజ్ అంచనాలు మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు రిస్క్ తో కూడుకున్నవి. కాబట్టి మీ ఆర్థిక సలహాదారుల సూచనల మేరకు పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవటం ఉత్తమం.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications