IT News: గడచిన కొన్ని రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి రికవరీ మోడ్ లో ప్రయాణం చేస్తున్నాయి. ఈ వారం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చాలా రంగాల్లో స్థిరమైన రికవరీ కనిపించటంతో ఇన్వెస్టర్లు కొంత ఊపిరిపీల్చుకుంటున్నారు. నష్టాలను రికవర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఐటీ కంపెనీలకు చెందిన షేర్లు సైతం భారీగానే పెరుగుదలను చూశాయి. గత ఏడాది కాలంలో ఐటీ స్టాక్స్ పనితీరు ప్రకారం ప్రస్తుతం వాటిని కొనుగోలు చేయెుచ్చా అనే అనుమానం ఇప్పటికీ చాలా మంది ఇన్వెస్టర్లలో ఉంది.
ప్రస్తుతం టెక్ స్టాక్స్ పనితీరును పరిశీలిస్తే గడచిన ఏడాది కాలంలో విప్రో కంపెనీ షేర్లు తన పెట్టుబడిదారులకు అత్యధికంగా 47 శాతం రాబడిని అందించి ఇతర పోటీదారులక కంటే మెరుగైన పనితీరును కనబరిచింది. దీని తర్వాత టెక్ మహీంద్రా స్టాక్స్ 45.72 శాతం, హెచ్సీఎల్ టెక్నాలజీస్ 43.85 శాతం, ఇన్ఫోసిస్ 33.46 శాతం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 24.81 శాతం ర్యాలీని చూశాయి. ప్రస్తుతం విప్రోకి ఆకర్షణీయమైన రిస్క్-రివార్డ్ ప్రొఫైల్‌ను అందించిందని నువామా ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ తెలిపింది. ఈ క్రమంలో నువామా విప్రో షేర్లకు గతంలో అందించిన హోల్డ్ రేటింగ్ అప్ గ్రేడ్ చేస్తూ బై రేటింగ్ అందించింది. ఇదే క్రమంలో షేర్ టార్గెట్ ధరను రూ.520 నుంచి రూ.700కి పెంచింది.

ప్రస్తుతం విప్రో కొత్త సీఈవో రావటంతో కొత్త ఆశలు, అంచనాలు కంపెనీపై పెట్టుబడిదారులకు ఉన్నాయని నువామా పేర్కొంది. ఈ క్రమంలో పోటీదారులైన ఇన్ఫోసిస్, ఎల్టిఐ మైండ్ ట్రీ, ఎంఫసిస్ తో పోల్చినప్పుడు విప్రో విచక్షణ ఖర్చులు రాబడిలో 60-65 శాతం సాపేక్షంగా ఎక్కువ ఎక్స్పోజర్ కలిగి ఉందని బ్రోకరేజ్ పేర్కొంది. అమెరికా సెంట్రల్ బ్యాంక్ తన వడ్డీ రేట్లను తగ్గించటంతో పాటు ఇటీవల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటం విప్రోకు మేలు చేకూరుస్తాయని నువామా పేర్కొంది. రానున్న రెండు మూడు త్రైమాసికాల్లో కంపెనీ పనితీరు మరింతగా మెరుగుపడుతుందని వెల్లడిస్తూ కంపెనీ కన్సల్టింగ్ విభాగం క్యాప్ కో గడచిన రెండు త్రైమాసికాలుగా వృద్ధి బాటలో నుడవటం శుభశూచికంగా పేర్కొంది.
FY25లో కన్సల్టింగ్‌లో వృద్ధికి సంబంధించి టెక్ దిగ్గజం యాక్సెంచర్ ఇటీవలి కాలంలో చేసిన వ్యాఖ్యలు, మార్గదర్శకత్వం కూడా కన్సల్టింగ్ వ్యాపారంలో రికవరీని ధృవీకరిస్తుంది. ఇదే క్రమంలో అమెరికాకు చెందిన బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సంస్థలు మెల్లగా తమ టెక్ స్పెండింగ్ పెంచుతున్నట్లు టీసీఎస్, యాక్సెంచర్, ఇన్ఫోసిస్ వెల్లడించాయి. అయితే ఈ రంగం నుంచి 34 శాతం వ్యాపార ఆదాయాన్ని పొందుతున్న విప్రోకు ఇది పెద్ద శుభవార్త. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సంస్థల నుంచి వచ్చే ఆదాయం రానున్న కాలంలో విప్రోకు పెరిగి ఆర్థిక వృద్ధికి దారితీస్తుందని నువామా వెల్లడించింది. అలాగే 14 ఏళ్లుగా బయటి వ్యక్తులకు సీఈవో బాధ్యతలు అప్పగించిన కంపెనీ తొలిసారిగా కంపెనీలో 32 ఏళ్లు పనిచేసిన అనుభవజ్ఞుడు పిళ్లైని ఎంచుకోవటం ఈ సారి కొత్త ఆశలు చిగురింపజేస్తోందని బ్రోకరేజ్ పేర్కొంది. అనేక అనుకూలమైన విషయాలు ఉండటంతో ప్రస్తుతం ఐటీ స్టాక్స్ లో విప్రో షేర్లు ఇన్వెస్టర్లు పెట్టుబడికి అనుకూలమైనవిగా తెలుస్తోంది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications