Vodafone Idea Share: టెలికాం వ్యాపారంలో ఒకప్పుడు వెలుగువెలిగిన కంపెనీ ఐడియా, వోడాఫోన్ లు ప్రస్తుతం సంయుక్తంగా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అంబానీ జియో దెబ్బకు కంపెనీ లాభాల నుంచి భారీ నష్టాల్లోకి కూరుకుపోయింది.
ప్రస్తుతం కంపెనీకి నష్టాలు పెరుగుతున్నప్పటికీ ఇన్వెస్టర్లు మాత్రం కంపెనీ షేర్లపై సానుకూల దృక్పదాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటీవలే కంపెనీ నిధుల సేకరణ కోసం నిర్వహించిన ప్రయత్నాలకు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన కూడా లభించింది. దీంతో కంపెనీ ఇతర పోటీదారులతో సమానంగా ఉండేందుకు దేశవ్యాప్తంగా తన 5జీ సేవలను లాంచ్ చేసేందుకు నిధులను వెచ్చించాలని చూస్తోంది. ఈ క్రమంలోనే నేడు వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ షేర్లు ఇంట్రాడేలో 3 శాతం మేర లాభపడి గరిష్ఠ స్థాయి రూ.13.75ని తాకాయి.

మరోపక్క బ్రోకరేజ్ సంస్థలు సైతం కంపెనీ షేర్లపై పాజిటివ్ దృక్కోణ కలిగి ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ బ్రోకరేజ్ నోమురా కంపెనీ షేర్లకు రూ.15 టార్గెట్ ధరగా ప్రకటించింది. ఇటీవల కంపెనీ ఫండ్ రైజింగ్ విజయవతం, నాలుగో త్రైమాసిక ఫలితాల ప్రకటన తర్వాత బ్రోకరేజ్ ప్రకటన వెలువడింది. కంపెనీకి చెడ్డ కాలం ముగిసిందని నోమురా అభిప్రాయపడింది. భారతీయ టెలికాం రంగంలో ఆటగాళ్లు ఇప్పుడు ARPUని పెంచడంపై దృష్టి సారిస్తుండటంతో పాటు మార్కెట్ ముగ్గురు వ్యక్తుల ప్లేయర్‌గా స్థిరపడుతోందని బ్రోకరేజ్ వెల్లడించింది.
నోమురా తన FY25F EBITDA అంచనాను 2% తగ్గించింది కానీ తక్కువ క్లయింట్ నష్టాల కారణంగా FY26F EBITDAని 6% పెంచింది. కంపెనీ విజయవంతమైన నిధుల సేకరణ దాని అవకాశాలను మెరుగుపరుస్తూ.. నెట్‌వర్క్ అనుభవాన్ని మెరుగుపరచడానికి, 5G రోల్‌అవుట్‌ను ప్రారంభించేందుకు, ప్రభావవంతంగా పోటీ చేయడానికి వీలు కల్పిస్తుందని బ్రోకరేజ్ పేర్కొంది. కేంద్ర ఎన్నికల తర్వాత భారీగా ఛార్జీలు 15 పెరుగుతాయని వారు భావిస్తున్నారు. ఇది స్టాక్‌కు ముఖ్యమైన ట్రిగ్గర్ కావచ్చని పేర్కొంది. అలాగే FY25 చెల్లింపులకు ప్రభుత్వం నుంచి ఉపశమనాన్ని ఆశిస్తున్నారు.
విఐ క్యూ4 ఫలితాలు..
మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో టెలికాం దిగ్గజం నష్టం రూ.7,675 కోట్లకు పెరిగింది. ప్రధానంగా వడ్డీ, ఫైనాన్స్ ఖర్చులు పెరగడం వల్ల కంపెనీ నష్టాలు పెరిగాయి. ఏడాది క్రితం 2022-23 ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.6,419 కోట్ల నష్టాన్ని చవిచూసింది. సమీక్షిస్తున్న త్రైమాసికంలో తమ సమగ్ర ఆదాయం దాదాపు రూ.10,607 కోట్లకు చేరుకుందని వొడాఫోన్ ఐడియా తన స్టాక్ మార్కెట్ ఫైలింగ్స్‌లో పేర్కొంది. దీంతో మొత్తం 2023-24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నష్టం గత ఏడాది రూ.29,301.1 కోట్ల నుంచి రూ.31,238.4 కోట్లకు పెరిగింది. ఈ కాలంలో కంపెనీ నిర్వహణ ఆదాయం స్వల్పంగా 1.1 శాతం పెరిగి రూ.42,651.7 కోట్లకు చేరుకుంది. అలాగే కస్టమర్ల నుంచి వస్తున్న సగటు ఆదాయం ఏడాది ప్రాతిపదికన 7.6 శాతం పెరిగి రూ.146గా ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది.


Click it and Unblock the Notifications