Stock Tips: చాలా కాలం ర్యాలీ తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు కరెక్షన్ మోడ్ లో కొనసాగుతున్నాయి. వీటికి తోడు అంతర్జాతీయ పరిణామాలు, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, ఇతర కారణాలతో ఒడిదొడుకుల్లో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఏ షేర్లలో ఇన్వెస్ట్ చేయాలో తెలియక అనేక మంది రిటైల్ ఇన్వెస్టర్లు అయోమయంలో ఉన్నారు.
ఈ క్రమంలో దేశంలోని ప్రముఖ పురాతన బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ కొన్ని షేర్లపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. లార్జ్ క్యాప్ కేటగిరీలో రానున్న కాలంలో కనకవర్షం కురిపించగలిగిన రెండు కంపెనీలకు కొనుగోలు రేటింగ్ ఇచ్చింది. ఈ షేర్లు రానున్న కాలంలో ఎంతకు చేరుకుంటాయనే అంచనా ధరలను సైతం బ్రోకరేజ్ వెల్లడించింది. ఎంచుకున్న కంపెనీల పనితీరు సైతం ఇటీవల బ్రోకరేజ్ చెప్పిన మార్గంలోనే సానుకూలంగా కొనసాగుతోంది.

ముందుగా మోతీలాల్ ఓస్వాల్ తన రీసెర్చ్ ద్వారా ఎల్ అండ్ టి లిమిటెడ్ కంపెనీ షేర్లపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. దేశంలో ప్రఖ్యాత ఇంజనీరింగ్ కంపెనీగా కొనసాగుతున్న ఎల్ అండ్ టి షేర్లు రానున్న కాలంలో రూ.2,830 ధరను చేరుకుంటాయని టార్గెట్ ధరను ప్రకటిస్తూ BUY రేటింగ్ ఇచ్చింది. ఇదే క్రమంలో ఇన్వెస్టర్లు రూ.2,660ని స్టాప్ లాస్ ధరగా పెట్టుకోవాలని సూచించింది. అయితే శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి కంపెనీ షేర్ ధర ఎన్ఎస్ఈలో రూ.2,632 వద్ద ఉంది. 2023 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కంపెనీ షేర్ ధర 26 శాతం మేర లాభపడింది.
ఇక రెండవ ఎంపికగా మోతీలాల్ బ్రోకరేజ్ సంస్థ పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్‌ను ఎంచుకుంది. ఇటీవల కంపెనీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, బ్లాక్ డీల్స్, కంపెనీ లాభదాయకత వైపు వేగంగా అడుగులు వేయటం వంటి కారణాలతో స్టాక్ మంచి ర్యాలీని కొనసాగిస్తోంది. ఈ తరుణంలో పేటీఎం షేర్లకు రూ.1,000 టార్గెట్ ధరను ఇస్తూ BUY రేటింగ్ అందించింది. అలాగే షేర్ పడిపోతే రూ.913ను స్టాప్ లాస్ కింద పెట్టుకోవాలని ఇన్వెస్టర్లకు సూచించింది. ఈ క్రమంలో శుక్రవారం మార్కెట్లు ముగిసే నాటికి స్టాక్ ధర ఎన్ఎస్ఈలో రూ.898 వద్ద ఉంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి స్టాక్ 69 శాతం లాభపడి ఇన్వెస్టర్లకు లాభాల పంట పడించింది.
NOTE: పైన్ అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆదారంగా ఎలాంటి ట్రేడింగ్ చేయకండి. స్టాక్ మార్కెట్లు నష్టాలతో కూడుకున్నవి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మీ ఆర్థిక నిపుణుడిని సంప్రదించటం ఉత్తమం.


Click it and Unblock the Notifications