Investment Ideas: కొత్త సంవత్సరం ప్రారంభం అయ్యింది. ఇప్పటికే దేశీయ స్టాక్ మార్కెట్లు తమ మెుదటి రోజు ప్రయాణాన్ని పూర్తి చేశాయి. అయితే కొత్త ఏడాది పెట్టుబడి రెజల్యూషన్లలో భాగంగా ఎలాంటి స్టాక్స్ లో పెట్టుబడులు పెట్టాలి ఎంత రాబడి కోసం ప్రయత్నించాలి అనే లెక్కల్లో ఇన్వెస్టర్లు మునిగి తేలుతున్నారు. ప్రధానంగా ఇన్వెస్టర్లు వారి లక్ష్యాలకు అనుగుణంగా బ్రోకరేజీల రిపోర్టుల్లో తమకు అనువైన షేర్ల కోసం అన్వేషిస్తున్నారు.
2025లో మంచి రాబడులను అందించే రియల్టీ స్టాక్ గురించి ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ కీలక ప్రకటన చేసింది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది సిగ్నేచర్ గ్లోబల్ ఇండియా లిమిటెడ్ కంపెనీ గురించే. 2023లో కంపెనీ దేశీయ స్టాక్ మార్కెట్లోకి తన ఐపీవోను ఫ్లోట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి స్టాక్ తన లిస్టింగ్ ధర రూ.385 కంటే పెట్టుబడిదారులకు 252 శాతం రాబడిని అందించి బెస్ట్ మల్టీబ్యాగర్ స్టాక్ జాబితాలో చేరిపోయింది. ప్రధానంగా కంపెనీకి వ్యాపార పరంగా గురుగ్రామ్ ప్రధాన మార్కెట్ గా కొనసాగుతోంది. ప్రధానంగా అక్కడ గృహకొనుగోళ్లకు మంచి డిమాండ్ ఉన్నందున 24.3 మిలియన్ చదరపు అడుగుల నిర్మాణాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.

ఈ క్రమంలో దేశీయ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ సిగ్నేచర్ గ్లోబల్ ఇండియా లిమిటెడ్ షేర్లపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. 2025లో కంపెనీ షేర్ల ధర ఒక్కోటి రూ.2,000 మార్కును చేరుకుంటుందని తన అంచనాలను ప్రకటించింది. కంపెనీ బలమైన పనితీరును కనబరచటానికి కారణం 2014లో కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వ విధానం ద్వారా గురుగ్రామ్‌లో సరసమైన, మధ్య-ఆదాయ గృహాల అండర్సవ్డ్ విభాగంపై దృష్టి పెట్టడమేనని బ్రోకరేజ్ పేర్కొంది. అలాగే గడచిన దశాబ్ధకాలంగా కంపెనీ 32,000 యూనిట్లను విక్రయించిన రికార్డును కలిగి ఉంది.
ప్రీమియం ఆఫర్‌లు, బలమైన పైప్‌లైన్‌పై దృష్టి సారించడంతో కంపెనీ ప్రీ-సేల్స్ విలువ పరంగా 35 శాతం CAGRగా ఉంటుందని మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేసింది. ఇది కంపెనీకి ఆర్థిక వనరులను పెంచటంతో పాటు లాభదాయకతను పెంచుతూ కంపెనీకి ముందుకు వెళ్లటానికి మరింత బలాన్ని అందిస్తుందని బ్రోకరేజ్ వెల్లడించింది. ఈ క్రమంలో నేడు ఇంట్రాడేలో ఉదయం 9.44 గంటల సనయంలో కంపెనీ షేర్ల ధర ఎన్ఎస్ఈలో ఒక్కోటి స్వల్పలాభాలతో రూ.1,353 వద్ద కొనసాగుతోంది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

10 గ్రాములు బంగారం ధర రూ. 3 లక్షలకు చేరబోతోంది.. సంచలన అంచనాను విడుదల చేసిన క్రిస్ వుడ్..



Click it and Unblock the Notifications