Investment: జెఫరీస్ మెచ్చిన స్టాక్స్.. BUY రేటింగ్ తో దూకుడు.. మీ దగ్గర ఉన్నాయా..?
Investment: కొత్త సంవ్సరం కొత్త పెట్టుబడి అవకాశాల కోసం చాలా మంది ఇన్వెస్టర్లు వెతుకుతూనే ఉంటారు. అయితే ఇన్వెస్టర్ల అభిరుచి, వారికి వివిధ రంగాలపై ఉన్న ఆసక్తి, పట్టుకు అనుగుణంగా రంగాలను ఎంచుకుంటుంటారు. ఆ రంగంలో మంచి కంపెనీలను ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే 2023లో మెరవనున్న రంగం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మెరుస్తున్న రంగం..
గతవారం స్టాక్ మార్కెట్లను గమనించినట్లయితే.. మెటల్ స్టాక్స్ మంచి ర్యాలీని నమోదు చేశాయి. ఈ క్రమంలో భారతీయ లోహాలపై జెఫరీస్ సానుకూలంగా మారడంతో కొన్ని షేర్లకు BUY రేటింగ్ ఇచ్చింది. మెటల్ స్టాక్స్‌పై జాగ్రత్త వహించాలని సలహా ఇచ్చిన ఏడాది తర్వాత.. జెఫరీస్ ఈ రంగంపై బుల్లిష్‌గా మారింది. ఇన్‌ఫ్లెక్షన్-డౌన్ ఎర్నింగ్స్ సైకిల్, చైనాలో డిమాండ్ ఆందోళనల తర్వాత జనవరి 2022లో బ్రోకరేజ్ ఇండియన్ స్టీల్‌పై విపరీతంగా మారింది.

BUY రేటింగ్ స్టాక్స్..
బ్రోకరేజ్ ఇప్పుడు టాటా స్టీల్, హిందాల్కోలను Hold రేటింగ్ నుంచి BUY రేటింగ్ కు అప్‌గ్రేడ్ చేసింది. ఈ క్రమంలో టాటా స్టీల్ కు రూ.150 టార్గెట్ ధరగా ఫిక్స్ చేయగా.. హిందాల్కొకు రూ.600ను టార్గెట్ ధరగా బ్రోకరేజ్ జెఫరీస్ నిర్ణయించింది. ప్రస్తుతం టాటా స్టీల్ స్టాక్ ధర రూ.117 ఉండగా.. హిందాల్కొ స్టాక్ ధర రూ.481గా ఉన్నాయి.

మరిన్ని షేర్లపై బులిష్..
జెఫరీస్ ఇదే క్రమంలో కోల్ ఇండియాపై తన 'హోల్డ్' ట్యాగ్‌ను కొనసాగిస్తూ రూ.220 టార్గెట్ ధరను, JSW స్టీల్‌పై 'అండర్‌పెర్ఫార్మ్' రేటింగ్‌ను కొనసాగిస్తూ రూ.470 టార్గెట్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. గత ఐదు త్రైమాసికాల్లో క్షీణత తర్వాత టాటా స్టీల్, JSW స్టీల్ కంపెనీల మార్జిన్లు పెరుగుతాయని జెఫరీస్ తాజా అంచనాల్లో వెల్లడించింది. కంపెనీలు తక్కువ కోకింగ్ బొగ్గు ఖర్చులను కూడా ఉపయోగించుకోగలుగుతాయని తెలిపింది.

షేర్ల బూమింగ్ అందుకే..
2023లో టాటా స్టీల్,హిందాల్కో కంపెనీల EBITDA ట్రెండ్ గమనిస్తే పరిస్థితులు మెరుగుపడటం స్టాక్స్ ధరల పెరుగుదలకు కారణంగా ఉంది. కరోనాలో కొవిడ్ ఆంక్షలను సడలించటం ప్రారంభించినందున.. అక్కడి రియల్టీ రంగాన్ని తిరిగి గాడిలో పెట్టాలని చైనా కృషి చేస్తోంది. ఇది భారతీయ ఉక్కు కంపెనీలకు కలిసొస్తున్న అంశం. ఈ కారణాలతో దేశీయ స్టీల్ కంపెనీల మార్జిన్లు, ఆదాయాలు మెరుగుపడతాయని మార్కెట్ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి.

పెద్ద మార్కెట్లు..
ప్రపంచ పెద్దన్న అమెరికా, యూరోపియన్ యూనియన్ ఆర్థిక వ్యవస్థల్లో బలహినత కారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో చైనా నుంచి వస్తున్న డిమాండ్ భారత ఉక్కు కంపెనీల పునరుద్ధరణకు దోహదపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటి ప్రకారం రానున్న కాలంలో దేశీయ ఉక్కు రంగంలోని కంపెనీలు మంచి లాభాలను ఆర్జించగలవని తెలుస్తోంది. ఇన్వెస్టర్లు సైతం ఈ రంగంలోని కంపెనీలను నిశితంగా పరిశీలిస్తున్నాయి.
NOTE: పైన అందించిన వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్ తో కూడుకున్న అంశం. ఆర్థిక నిపుణులను సంప్రదించి పెట్టుబడులు పెట్టడం ఉత్తమం.


Click it and Unblock the Notifications