Stock Market 2024: స్టాక్ మార్కెట్‌పై జెఫరీస్ సంచలన నివేదిక.. మోదీ సర్కార్ రాకపోతే పరిస్థితి..?
Stock Market: దేశంలో బీజేపీ ఎన్డీఏ కూటమి ప్రస్తుతం అధికారంలో ఉంది. వరుసగా రెండో సారి కేంద్రంలో పగ్గాలు చేపట్టిన మోదీ సర్కార్ మూడోసారి ఎన్నికలకు సిద్ధం అవుతోంది.
2024 సార్వత్రిక ఎన్నికలు భారతదేశంలో దగ్గర పడుతున్నాయి. లోక్ సభ ఎన్నికలకు ఎక్కువ సమయం కూడా లేదు. మోదీ సర్కార్ ఇప్పటికే 9 ఏళ్ల సుదీర్ఘ పరిపాలనను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్లు ఎన్నికలపై దృష్టి సారించాయి. రానున్న కాలంలో ఎవరి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తుందనే అంశంపై చర్చ కొనసాగుతోంది. బీజేపీ మాత్రం తాము పూర్తి బలంతో తిరిగి అధికారంలోకి వస్తామని ధీమాగా ఉండగా.. కాంగ్రెస్ కూటమి సైతం పుంజుకుంటోంది.

ఈ క్రమంలో అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ పెద్ద విషయం బయటపెట్టింది. 2024లో నరేంద్ర మోడీ నేతృత్వంలోని సంకీర్ణం ఓడిపోతే స్టాక్ మార్కెట్ భారీ పతనాన్ని చూడనున్నట్లు నివేదించింది. 2004లో లాగా జనతా పార్టీ మళ్లీ అధికారంలోకి రాకపోతే భారత స్టాక్ మార్కెట్ 25 శాతం మేర పడిపోయే అవకాశం ఉందని జెఫరీస్ ఈక్విటీ స్ట్రాటజీ గ్లోబల్ హెడ్ క్రిస్ వుడ్ వెల్లడించారు. ప్రపంచ సరఫరా గొలుసును ఆకర్షించడానికి ప్రస్తుత ప్రభుత్వం అనేక సంస్కరణలు కొనసాగిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
20 ఏళ్ల కిందట 2004లో అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఓటమిని చవిచూసింది. అప్పట్లో బీజేపీ ఓటమి తర్వాత రెండు రోజుల్లో స్టాక్ మార్కెట్ 20% మేర క్షీణించింది. అయితే దక్షిణాసియా ఆర్థిక వ్యవస్థను తెరవడానికి రూపొందించిన విధానాలను కొనసాగిస్తామని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం ప్రకటన తర్వాత మొదటి 2 రోజుల నష్టాలను మార్కెట్లు కొంతమేరకు రికవర్ అయ్యాయి.


Click it and Unblock the Notifications