Stocks To BUY: మాంద్యం భయాలు ప్రారంభం అయిన నాటి నుంచి ఐటీ కంపెనీలు చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఇదే క్రమంలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలటం కారణాంగా అనేక దిగ్గజ ఐటీ కంపెనీల షేర్లు కనిష్ఠాలకు పడిపోతున్నాయి. అయితే దీనిని పెద్ద అవకాశంగా మలుచుకోవాలని చాలా మంది ఇన్వెస్టర్లు చూస్తున్నారు. ఈ సమయంలో బ్రోకరేజ్ సంస్థలు ఏమని సూచిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకోండి..

స్టాక్స్ టార్గెట్..
బ్రోకరేజ్ హౌస్ ఫిలిప్ క్యాపిటల్ అంచనా ప్రకారం రాబోయే కాలంలో 7 కంపెనీల షేర్లు ఇన్వెస్టర్లకు మంచి లాభాలను ఆర్జించి పెడతాయని తెలిపింది. వారి అంచనాల ప్రకారం.. TCS షేర్లు రూ.4,200 వరకు పెరగవచ్చు. బ్రోకరేజీ సంస్థ ఇన్ఫోసిస్‌కు రూ.1,930, లార్సెన్ & టూబ్రో ఇన్ఫోటెక్‌కు రూ.5,440, మైండ్ ట్రీకి రూ.4,350, కోఫోర్జ్‌కు రూ.5,010, పెర్సిస్టెంట్ సిస్టమ్స్‌కు రూ.4,420, ఎంఫాసిస్‌కు రూ.3,080 టార్గెట్ ధరగా నిర్ణయించింది. ఫిలిప్‌క్యాపిటల్స్ అన్ని కంపెనీల షేర్లకు 'BUY' రేటింగ్‌ను ఇచ్చింది.

బ్రోకర్ అభిప్రాయం..
ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత సమయాలు ఐటీ రంగానికి లోతైన దెబ్బను ఇచ్చాయి. షేర్లు పతనం కావడానికి ఇదే కారణం. కానీ ఈ మాంద్యం భయాల మధ్య.. ఐటీ రంగంలోని ఈ స్టాక్స్ దీర్ఘకాలంలో గొప్ప రాబడిని ఇవ్వగలవు. రానున్న రోజుల్లో ఐటీ రంగ ఆదాయం 2.2 శాతం నుంచి 7.1 శాతానికి పెరుగుతుందని బ్రోకరేజీ అంచనా వేస్తోంది. దీని వల్ల ఇన్వెస్టర్లకు లాంగ్ టర్మ్ లో భారీగా లాభాలు వస్తాయని పైగా క్యాపిటల్ అప్రీలిసియేషన్ లభిస్తుందని పేర్కొం

పెట్టుబడులకు అవకాశం..
మార్కెట్ల క్షీణిస్తున్న సమయంలో చాలా మంది కొత్తగా పెట్టుబడులు పెడుతున్నవారు భయపడుతుంటారు. అయితే ఇప్పటికే మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తున్నవారికి హెచ్చుతగ్గులు సహజమేనని తెలుసు. అందుకే వారు కంపెనీ ఆర్థిక అంశాలు, ఫండమెంటల్స్ పరిశీలించి పెట్టుబడులను కొనసాగిస్తుంటారు. ప్రస్తుతం సమయంలో.. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఈ ఏడాది 31 శాతం వరకు క్షీణించింది. ఇదే సమయంలో నిఫ్టీ సూచీ మాత్రం కేవలం 2.5 శాతం పతనమైంది. ఈ పరిస్థితులను ఎంపిక చేసిన స్టాక్స్ రాబోయే కాలంలో అధిగమించగలవని పేర్కొంది.
NOTE: స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం అనేది ఒడిదొడుకులతో కూడుకున్న విషయం. నష్టపోయే ప్రమాదం ఉంటుంది. పెట్టుబడులకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా ఆర్థిక నిపుణులను సంప్రదించటం మంచిది. పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications