Mutual Funds: దేశంలో అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ మంది ఇన్వెస్టర్లకు చేరువైంది జెరోధా బ్రోకరేజ్. తక్కువ ధరలకు సేవలను అందుబాటులోకి తీసుకురావటంతో చాలా ప్రాచుర్యాన్ని పొందింది. తాజాగా ఈ సంస్థ మ్యూచువల్ ఫండ్స్ వ్యాపారంలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే.
భారతదేశపు సరికొత్త ఫండ్ హౌస్‌లలో ఒకటైన Zerodha Fund House, సోమవారం తన మొదటి రెండు మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ప్రారంభించేందుకు సెబీ వద్ద డ్రాఫ్ట్ డాక్యుమెంట్లను దాఖలు చేసింది. గత నెలలో నితిన్ కామత్ నేతృత్వంలోని జెరోధా మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ప్రారంభించడానికి SEBI నుంచి తుది ఆమోదం పొందింది. జెరోధా ఫండ్ హౌస్ అనేది బ్రోకరేజ్ సంస్థ జెరోధా, ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్ స్మాల్‌కేస్ మధ్య ఒక జాయింట్ వెంచర్. ఈ క్రమంలో కంపెనీ లాంట్ చేస్తున్న రెండు మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ గురించి గమనిస్తే..

1) జెరోధా నిఫ్టీ లార్జ్‌మిడ్‌క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్- "నిఫ్టీ లార్జ్‌మిడ్‌క్యాప్ 250 ఇండెక్స్ రిప్లికేటింగ్ లేదా ట్రాకింగ్ ఓపెన్-ఎండ్ స్కీమ్"
2) జెరోధా టాక్స్ సేవర్(ELSS) నిఫ్టీ లార్జ్ మిడ్‌క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్ - ఇది ఫైలింగ్ ఓపెన్ అవుతుంది. 3 ఏళ్ల చట్టబద్ధమైన లాక్-ఇన్ వ్యవధితో పాసివ్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్. ఇది నిఫ్టీ లార్జ్ మిడ్‌క్యాప్ 250 ఇండెక్స్‌ను రెప్లికేట్ చేయడం లేదా ట్రాక్ చేయడం ద్వారా పన్ను ప్రయోజనాన్ని అందిస్తుంది.

ELSS పథకం అనేది పన్ను ఆదా చేసే పథకం. ఇది సెక్షన్ 80C పన్ను మినహాయింపు ప్రయోజనాలను రూ.1.5 లక్షల వరకు పెట్టుబడిగా ఇస్తుంది. గత నెలలో విశాల్ జైన్‌ను జెరోధా ఫండ్ హౌస్ సీఈవోగా ప్రకటించారు. జెరోధా పాసివ్ ఫండ్స్ ద్వారా ఫండ్ మేనేజ్మెంట్ ఖర్చులు తగ్గిస్తూ.. తక్కువ ధరల వద్ద ఉత్పత్తులను ప్రారంభించేందుకు వీలు కల్పిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications