Stock Ideas: మార్కెట్ల ర్యాలీలో ఏ షేర్లు కొనాలో చాలా మంది ఇన్వెస్టర్లు తెలియక ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ స్టాక్ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్టర్లకు ఒక షేరును సూచిస్తోంది.
మోతీలాలా ఓస్వాల్ ప్రకారం దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లకు తన టార్గెట్ ధరను పెంచింది. నేడు ఎస్బీఐ స్టాక్ ధర రూ.643.50 వద్ద కొనసాగుతోంది. రానున్న కాలంలో స్టాక్ ధర రూ.800 స్థాయికి చేరుకుంటుందని వెల్లడించింది. అయితే దీనికి ముందు బ్రోకరేజ్ బ్యాంక్ లక్ష్య ధరను రూ.700గా ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్కెట్లో నేడు ట్రేడవుతున్న ధర కంటే దాదాపు 25 శాతం ఎక్కువ రేటు వద్ద తన లక్ష్యాన్ని ఉంచింది.

ప్రభుత్వ దిగ్గజ బ్యాంక్ ఆదాయాల పెరుగుదల, మెరుగైన రుణ వృద్ధి, మార్జిన్ స్థిరత్వం, నియంత్రిత క్రెడిట్ ఖర్చుల ఆధారంగా టార్గెట్ ధరను పెంచినట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నిపుణులు వెల్లడించారు. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకులపై బ్రోకరేజీ సంస్థ 'BUY' రేటింగ్ ఇచ్చింది.
ఇతర బ్యాంకుల టార్గెట్ ధరలను పరిశీలిస్తే.. బ్యాంక్ ఆఫ్ బరోడా స్టాక్ టార్గెట్ ధరను రూ.240 నుంచి రూ.280కి పెంచబడింది. ఇది ప్రస్తుతం బరోడా షేర్ ధర కంటే దాదాపు 25 శాతం కంటే అధికం. ఇండియన్ బ్యాంక్ టార్గెట్ ఒక్కో షేరుకు రూ.460 నుంచి రూ.525కి పెంచబడింది. ఇది ప్రస్తుత ధర కంటే దాదాపు 18.5 శాతం అధికం. యూనియన్ బ్యాంక్ స్టాక్ టార్గెట్ ధర రూ.130 నుంచి రూ.150కి, కెనరా బ్యాంక్ షేర్ టార్గెట్ ధర రూ.440 నుంచి రూ.550కి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ టార్గెట్ ధరను రూ.75 నుంచి రూ.90కి బ్రోకరేజ్ అప్‌గ్రేడ్ చేసింది.


Click it and Unblock the Notifications