Stock Tips: గతవారం నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈరోజు ఉదయం సైతం ఊహించని రీతిలో భారీ క్షీణతను నమోదు చేసింది. ఈ క్రమంలో బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రియల్టీ రంగంలో 25 శాతం వరకు లాభాలను ఇచ్చే షేర్లను ప్రకటించింది.
ముందుగా గోద్రెజ్ ఇండస్ట్రీస్ కింద పనిచేస్తున్న రియల్టీ కంపెనీ గోద్రెజ్ ప్రాపర్టీస్‌ను మోతీలాల్ ఎంచుకుంది. ముంబై కేంద్రంగా పనిచేస్తున రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కంపెనీకి నివాస, వాణిజ్య, టౌన్‌షిప్ రంగాల్లో ఆస్తులను కలిగి ఉంది. గోద్రెజ్ ప్రాపర్టీస్ స్టాక్ టార్గెట్ ధరను మోతీలాల్ ఓస్వాల్ రూ.1,915గా నిర్ణయించింది. ప్రస్తుతం మార్కెట్ ధర రూ.1,550 కంటే 23 శాతం అధికం.

బ్రోకరేజ్ మార్కోటెక్ డెవలపర్స్ కంపెనీ ఇండియాతో పాటు యూకేలో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. హౌసింగ్ ప్రాజెక్టులు, ప్రీమియం- లగ్జరీ ప్రాజెక్టులను కంపెనీ నిర్మిస్తోంది. 2019-22 మధ్య కాలంలో కంపెనీ 50,000 కంటే ఎక్కువ ఇళ్లను పూర్తి చేసి అప్పగించింది. మోతీలాల్ ఓస్వాల్ స్టాక్ టార్గెట్ ధరను రూ.850గా అంచనా వేసింది. ఇది ప్రస్తుత ధర రూ.789 కంటే 7 శాతం అధికం.
శోభా లిమిటెడ్ ఒక భారత బహుళజాతి రియల్ ఎస్టేట్ కంపెనీ. బెంగళూరు కేంద్రంగా ఉన్న కంపెనీ.. చెన్నై, కోయంబత్తూర్, కేరళ, దిల్లీ-NCR వంటి భారతీయ నగరాల్లో వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. అలాగే యూఏఈ, ఒమన్, బహ్రెయిన్ వంటి దేశాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. మోతీలాల్ ఓస్వాల్ స్టాక్ టార్గెట్ ధరను రూ.750గా నిర్ణయించింది. ఇది ప్రస్తుత రూ.699 ధర కంటే 7 శాతం అధికం.
ప్రెస్టీజ్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ బెంగుళూరు ప్రధాన కార్యాలయంగా దక్షిణ భారతదేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థగా కొనసాగుతోంది. కంపెనీ 142 రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను పూర్తి చేసింది. అపార్ట్‌మెంట్లు, విల్లాలు వంటి నివాస ప్రాపర్టీలను, కార్పొరేట్ ఆఫీస్ బ్లాక్‌లతో సహా వాణిజ్య ఆస్తులను కూడా అభివృద్ధి చేస్తుంది. మోతీలాల్ ఓస్వాల్ ప్రెస్టీజ్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ షేర్లపై టార్గెట్ ధర రూ.750గా ప్రకటించింది. ఇది ప్రస్తుత ధర రూ.600 కంటే 25 శాతం అధిక ధర.
బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న బ్రిడ్జ్ ఎంటర్‌ప్రైజెస్.. బెంగుళూరు, మెజు, మంగళూరు, చిక్కమగళూరు, హైదరాబాద్, చెన్నై, కొచ్చిలలో నిర్మాణాలను కొనసాగిస్తోంది. కంపెనీకి నివాస, వాణిజ్య, రిటైల్, ఆతిథ్య రంగాలలో భవనాలు ఉన్నాయి. కంపెనీ 275 భవనాలలో 80 మిలియన్ చదరపు అడుగుల రియల్ ఎస్టేట్ ఆస్తులను కలిగి ఉంది. మోతీలాల్ ఓస్వాల్ బ్రిడ్ ఎంటర్‌ప్రైజెస్ షేర్ టార్గెట్ ధరను రూ.720గా ప్రకటించింది. ఇది ప్రస్తుత రూ.577.85 ధర కంటే 24 శాతం ఎక్కువ.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications