Tata Elxsi: టాటా ఎల్క్సీ టార్గెట్ ప్రైస్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..
గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ JP మోర్గాన్ టాటా గ్రూప్ డిజైన్, టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్ అయిన టాటా ఎల్క్సీ టార్గెట్ ప్రైస్ ను భారీగా తగ్గించింది. తగ్గించడానికి గల కారణాలను కూడా వివరించింది. క్లయింట్లు, అమ్మకాల పరంగా కంపెనీ వ్యూహం బలంగా ఉందని, అయితే స్టాక్ ధర చాలా ఎక్కువగా బ్రోకరేజ్ అభిప్రాయపడింది. టాటా అలెక్సీ అనేది టాటా గ్రూప్ కు చెందిన సంస్థ.

ప్రస్తుతం రూ.9657
ఈ స్టాక్ ఇప్పటి వరకు పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడిని ఇచ్చింది. గత ఒక సంవత్సరంలో, స్టాక్ పెట్టుబడిదారుల సంపదను రెట్టింపు చేసింది. అయితే 5 సంవత్సరాలలో అది 1 లక్ష నుంచి 11 లక్షలకు పైగా సంపాదించి పెట్టింది. ఆగస్టు 25, 2022న షేరు ధర రూ.9657 వద్ద ముగిసింది. స్టాక్ వాల్యుయేషన్ చాలా ఖరీదుగా ఉందని పేర్కొంది.

P/E మల్టీపుల్ 85
ఒక సంవత్సరం P/E మల్టీపుల్ 85 చాలా ఎక్కువ ఉందని విశ్లేషించింది. గత 2 సంవత్సరాలలో కంపెనీ వృద్ధిని పరిశీలిస్తే, ఇది అద్భుతమైనది అయితే ఆఫ్‌షోర్ వ్యాపారంలో మార్పు వచ్చే అవకాశం మార్జిన్ రిస్క్‌ను చూపుతోందని అభిప్రాయపడింది. అందుకే టార్గెట్ ప్రైస్ ను తగ్గించినట్లు పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (క్యూ1ఎఫ్‌వై23)లో టాటా అలెక్సీ లాభం ఏడాది ప్రాతిపదికన దాదాపు 63 శాతం పెరిగి రూ.184.7 కోట్లకు చేరుకుంది.

పెరిగిన ఆదాయం
కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆదాయం 30 శాతం (YoY), 6.5 శాతం (QoQ) పెరిగి రూ.725.9 కోట్లకు చేరుకుంది. EPD, IDV, SIS త్రైమాసిక ప్రాతిపదికన కంపెనీ మూడు విభాగాలలో వరుసగా 6.3 శాతం, 6.6 శాతం, 19.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. EBITDA త్రైమాసిక ప్రాతిపదికన 7.6 శాతం, సంవత్సర ప్రాతిపదికన 58.8 శాతం పెరిగింది.

లక్ష 11 లక్షలు అయింది..
టాటా అలెక్సీ మల్టీబ్యాగర్ స్టాక్‌గా ఉంది. గత 5 సంవత్సరాలలో ఇప్పటివరకు, టాటా అలెక్సీ రాబడి 1062 శాతం పెరిగింది. అంటే 5 సంవత్సరాల క్రితం ఎవరైనా ఈ స్టాక్‌లో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఉంటే, ఈ రోజు దాని మొత్తం విలువ దాదాపు 11 లక్షల రూపాయలకు చేరుతుంది. 2022లో ఇప్పటివరకు వచ్చిన స్టాక్ రిటర్న్‌ను పరిశీలిస్తే, ఇది దాదాపు 64 శాతం పెరిగింది.
Note: ఈ వార్త కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి రిస్క్ తో కూడుకున్నది.


Click it and Unblock the Notifications