Buzzing Stock: స్టాక్ లాభాల ఉప్పెన.. దమానీ కంపెనీపై నిపుణులు బులిష్.. కన్నేయండి..
Dmart Stock: స్టాక్ మార్కెట్లలో రాధాకిషన్ దమానీ గురించి తెలియని వారు ఉండరు అనటం అతిశయోక్తి కాదు. ఎందుకంటే బిగ్ బుల్ రాకేష్ జున్‌జున్‌వాలాకి ఆయన గురువు. పెట్టుబడులు పెట్టడమే కాక సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించి పెద్ద విజయాన్ని పొందారు దమానీ.
రాధాకిషన్ దమానీ దేశంలో అవెన్యూ సూపర్ మార్ట్స్ కింద డీమార్ట్ పోరుతో రిటైల్ స్టోర్లను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. నేడు మార్కెట్లో పెట్టుబడిదారుల ఫోకస్ ఈ కంపెనీ షేర్లపై ఉంది. ప్రారంభ ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు 3% క్షీణించి రూ.4,175.05 వద్ద ట్రేడవుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ స్టాక్ మరింత పెరగవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్రోకరేజ్ సంస్థ CLSA అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ షేర్లపై 'BUY' ఇచ్చింది. ఈ క్రమంలో షేర్ టార్గెట్ ధరను రూ.5,107గా నిర్ణయించింది. ఇది ప్రస్తుత మార్కెట్ రేటు కంటే దాదాపు 22 శాతం అధికం.

రానున్న కాలంలో దేశంలో డీమార్ట్ స్టోర్ల సంఖ్య ప్రస్తుతం ఉన్న 341 నుంచి మూడు రెట్లు పెరుగుతాయని CLSA అంచనా వేసింది. కంపెనీ చైన్‌లు కొత్త రాష్ట్రాలతో పాటు ఇప్పటికే ఉన్న రాష్ట్రాల్లోనూ తమ ఉనికిని విస్తరిస్తున్నాయి. అవెన్యూ సూపర్‌మార్ట్స్ స్టాక్‌లో తదుపరి దశ వృద్ధిని ప్రైవేట్ లేబుల్‌లు ముందుకు తీసుకువెళతాయని కూడా CLSA ఆశిస్తోంది. స్టాక్‌ను ట్రాక్ చేస్తున్న 26 మంది నిపుణుల్లో.. 11 మంది స్టాక్‌పై "BUY" రేటింగ్ అందించారు. ఆరుగురు హోల్డ్ రేటింగ్ ఇవ్వగా మిగిలిన 9 మంది షేర్లను విక్రయించాలని సూచిస్తున్నారు.
గడచిన ఏడాది కాలంలో డీమార్ట్ స్టాక్ దాదాపు 22 శాతం ర్యాలీని నమోదు చేసింది. కంపెనీ వ్యాపారం విషయానికి వస్తే.. రాధాకిషన్ దమానీ, అతని కుటుంబం మద్దతుతో నడుస్తున్న Dmart రిటైల్ స్టోర్స్ ప్రాథమిక గృహ, పర్సనల్ కేర్ ఉత్పత్తులను రిటైల్ చేస్తోంది. కంపెనీ తన స్టోర్లను దేశవ్యాప్తంగా.. మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, NCR, తమిళనాడు, పంజాబ్, రాజస్థాన్ లలో కలిగి ఉంది. రానున్న కాలంలో స్టోర్ల సంఖ్యను మరింత జోడించాలని చూస్తోంది. షేర్లపై కొనసాగుతున్న బులిష్ వ్యూ కారణంగా చాలా మంది కంపెనీ షేర్లలో పెట్టుబడికి ఉన్న అవకాశాలను అన్వేషిస్తున్నారు.


Click it and Unblock the Notifications