Vodafone Idea: 6% పెరిగిన వొడఫోన్ ఐడియా స్టాక్.. నిపుణులు వ్యూ ఇదే..!!
Vodafone Idea Shares: స్టాక్ మార్కెట్లో తక్కువ ధరకు లభించే షేర్ల కోసం వేట కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది పెట్టుబడి పెట్టేందుకు వొడఫోన్ ఐడియా షేర్లు దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ సిటీ గ్రూప్ వొడాఫోన్-ఐడియా షేర్ల పనితీరుపై బుల్లిష్‌గా ఉన్నట్లు కనిపిస్తోంది. బ్రోకరేజ్ సంస్థ స్టాక్‌ను కొనుగోలు చేయాలని సూచించింది. నేడు మార్కెట్ల ముగింపు సమయంలో టెలికాం స్టాక్ ధర రూ.16.70 వద్ద ముగిసింది. ఏజీఆర్ బకాయిల కేసుల్లో కంపెనీ అప్పీల్‌పై పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం అంగీకరించింది. ఇది స్టాక్ ధరలపై సానుకూల ప్రభావం చూపుతుందని సిటీ గ్రూప్ భావిస్తోంది.

ఒకవేళ చీఫ్ జస్టిస్ బెంచ్ కంపెనీకి మద్దతుగా తీర్పు ఇస్తే AGR బకాయిలను రూ.30,000 కోట్ల- రూ.35,000 కోట్ల వరకు తగ్గించవచ్చని సిటీ అభిప్రాయపడుతోంది. ఈ క్రమంలో కంపెనీ షేర్లకు BUY రేటింగ్ అందిస్తోంది. రానున్న కాలంలో కంపెనీ షేర్ ధర ఒక్కోటి రూ.23 స్థాయికి చేరుకోవచ్చని బ్రోకరేజ్ తన బులిష్ వ్యూ వ్యక్తం చేసింది. ఇది కంపెనీ షేర్ల ప్రస్తుత స్థాయి కంటే దాదాపు 37 శాతం అధికంగా ఉంది.
నేడు బీఎస్ఈలో కంపెనీ షేర్లు రూ.17.56 స్థాయిలో ప్రారంభమయ్యాయి. ఇంట్రాడేలో కంపెనీ షేర్లు బీఎస్ఈలో ఇంట్రా-డే గరిష్ట స్థాయి రూ.17.66కి చేరాయి. బీఎస్ఈలో వొడాఫోన్ ఐడియా 52 వారాల గరిష్టం రూ.19.15, 52 వారాల కనిష్ట ధర రూ.7.35గా ఉంది. గత ఏడాది కాలంలో వొడాఫోన్ షేర్ల ధరలు 125 శాతం పెరిగాయి. అంటే ఈ కాలంలో ఇన్వెస్టర్ల సొమ్ము రెండింతలు పెరిగింది.


Click it and Unblock the Notifications