Stocks for Next Week: నిఫ్టీ సూచీ గతవారం 19,800 మార్కును చేరుకోవటంతో మార్కెట్ల మూడ్ మరింత సానుకూలంగా మారిందని చాయిస్ బ్రోకరేడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమీత్ బగాడియా అన్నారు. ఈ క్రమంలో 20,000 మార్కును అధిగమిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మూడు కంపెనీల షేర్లు కొనుగోలుకు సూచించారు.
టాటా మోటార్స్ : బ్రోకరేజ్ సంస్థ ముందుగా టాటా మోటార్స్ కంపెనీ షేర్లపై సానుకూలతను వ్యక్తం చేసింది. ప్రస్తుతం కంపెనీ షేర్ ధర రూ.627.25 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో రానున్న వారంలో స్టాక్ ధర రూ.665 మార్కును చేరుచోవచ్చని అంచనా వేస్తూ BUY రేటింగ్ ఇచ్చింది. ఇదే క్రమంలో ఇన్వెస్టర్లు రూ.602 స్థాయిలను స్టాప్ లాస్ గా కొనసాగించాలని తెలిపింది. ఎందుకంటే 602 సపోర్ట్ జోన్ కింద పనిచేయటంతో పాటు.. 50 Day EMA లెవల్ అని వెల్లడించింది. ఇదే క్రమంలో బ్రోకరేజ్ సూచించిన రూ.665 అనేక టాటా మోటార్స్ స్టాక్ ఆల్ టైమ్ హై అని గమనించాలి.

హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ : ఇక చాయిస్ బ్రోకరేజ్ ఎంచుకున్న రెండవ స్టాక్ ఐటీ రంగానికి చెందిన టాప్ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌ది. ఈ కంపెనీ షేర్లను రూ.1,250 వద్ద కొనుగోలు చేయవచ్చని బ్రోకరేజ్ సూచిస్తోంది. అలాగే ఈ షేరు ధర రానున్న వారంలో రూ.1,310 నుంచి రూ,1,325 స్థాయిలకు చేరుకుంటుందని వెల్లడించింది. ఇదే క్రమంలో ఇన్వెస్టర్లు రూ.1,225 స్థాయిని స్టాప్ లాస్ కింద పరిగణించాలని తెలిపింది. RSI, MACD సూచికలు షేర్లలో పాజిటివ్ ట్రెండ్ సూచిస్తున్నట్లు బ్రోకరేజ్ తెలిపింది.
బజాజ్ ఆటో : ఇక చివరిగా బ్రోకరేజ్ సంస్థ బజాజా గ్రూప్ కంపెనీ బజాజ్ ఆటోపై తన బులిష్ వ్యూవ్ ను ప్రకటించింది. రానున్న వారంలో కంపెనీ స్టాక్ ధర రూ.4,900కి చేరుకోవచ్చని వెల్లడించింది. ఇన్వెస్టర్లు బజాజ్ ఆటో షేర్లను రూ.4,759 వద్ద కొనుగోలు చేసేందుకు పరిగణించొచ్చని వెల్లడించింది. ఇదే క్రమంలో రూ.4,650ని స్టాప్ లాస్ కింద పరిగణించాలని తెలిపింది. అనేక సాంకేతిక సూచికలు ప్రస్తుతం కంపెనీ షేర్లలో పాజిటివ్ మెుమెంటంను సూచిస్తున్నట్లు బ్రోకరేజ్ వెల్లడించింది.
Note: పైన తెలిపిన వివరాలు బ్రోకరేజ్ అభిప్రాయాలు. వీటి ఆధారంగా ఎలాంటి ట్రేడింగ్ నిర్ణయాలను తీసుకోకండి. వీటిని కేవలం అవగాహన కోసం మాత్రమే అందించటం జరిగింది. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి.


Click it and Unblock the Notifications