Stock Picks: స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు రిటైల్ ఇన్వెస్టర్లు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నాయి. అయితే చాలా మందికి ఉన్న సమస్య ఏమిటంటే ఎలాంటి కంపెనీలను లేదా షేర్లను ఎంచుకుని ఇన్వెస్ట్ చేయాలనే అవగాహన తక్కువగా ఉంటుంది. ఇలాంటి కారణాల వల్ల చాలా మంది నష్టాలను పొందుతున్నారు.

స్టాక్ బ్రోకర్..
దేశంలోని ప్రఖ్యాత బ్రోకరేజ్ యాక్సిస్ సెక్యూరిటీస్ కొన్ని కంపెనీల్లో పెట్టుబడులకు మంచి అవకాశాలను గుర్తించింది. దీర్ఘకాలంలో ఆ కంపెనీల్లో వృద్ధికి అవకాశం ఉన్నట్లు విశ్వసిస్తోంది. మొత్తం మార్కెట్‌కు మధ్యస్థ, దీర్ఘకాలిక దృక్పథం సానుకూలంగా ఉన్నప్పటికీ.. స్వల్పకాలంలో మార్కెట్ అస్థిరత కనిపించవచ్చని బ్రోకరేజ్ హౌస్ పేర్కొంది. మంచి కంపెనీల షేర్లను 'బై ఆన్ డిప్స్' కింద కొనుగోలు చేయవచ్చని బ్రోకరేజ్ అభిప్రాయపడింది.

మార్చి- 2023 కోసం స్టాక్స్..
ఈ నెలలో పెట్టుబడులు పెట్టేందుకు యాక్సిస్ బ్రోకరేజ్ కొన్ని కంపెనీల షేర్లను ఇన్వెస్టర్లకు సూచిస్తోంది. ఇందుకోసం టాప్ కంపెనీలను పిక్ చేయటంతో పాటు వాటికి టార్గెట్ ధరలను సైతం బ్రోకరేజ్ వెల్లడించింది. ఐసీఐసీఐ బ్యాంక్ టార్గెట్ ప్రైస్ రూ.1,150, టెక్ మహీంద్రా టార్గెట్ ధర రూ.1,300, మారుతీ సుజుకీ ఇండియా టార్గెట్ ధర రూ.9,760, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టార్గెట్ ధర రూ.750, దాల్మియా భారత్ టార్గెట్ ధర రూ.2,120, ఫెడరల్ బ్యాంక్ టార్గెట్ ధర రూ.170గా యాక్సిస్ సెక్యూరిటీస్ అంచనా వేసింది.

మరిన్ని సిఫార్సులు..
యాక్సిస్ సెక్యూరిటీస్ తన ఇన్వెస్టర్ల కోసం మెుత్తం 16 షేర్లను కొనుగోలు కోసం సిఫార్సు చేసింది. ఇందులో వరుణ్ బెవరేజెస్ టార్గెట్ ధర రూ.1,500, అశోక్ లేలాండ్ టార్గెట్ ధర రూ.175, ఇన్ఫోసిస్ టార్గెట్ ధర రూ.1,800, PNC ఇన్‌ఫ్రా టార్గెట్ ధర రూ.390, ఐటీసీ టార్గెట్ ధర రూ.377, హెల్త్ కేర్ గ్లోబల్ ఎంటర్ ప్రైజెస్ టార్గెట్ ధర రూ.330, ప్రజ్ ఇండస్ట్రీస్ టార్గెట్ ధర రూ.550, CCL ప్రోడక్ట్స్ టార్గెట్ ధర రూ.650, పాలిక్యాబ్ ఇండియా టార్గెట్ ధర రూ. 3,390, బజాజ్ ఫైనాన్స్ టార్గెట్ ధర రూ.7,400గా సిఫార్సు చేసింది.
Note: పైన సూచించిన షేర్లు కేవలం బ్రోకరేజ్ అందించిన వివరాలు మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి కాబట్టి మీ ఆర్థిక సలహాదారుడిని సంప్రదించటం ఉత్తమం.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications