బ్రిటన్‌లో కీలక ఆర్థికమంత్రిగా ఇన్ఫోసిస్ మూర్తి అల్లుడు రిషి!

లండన్: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు, బ్రిటన్ డిప్యూటీ ఆర్థిక మంత్రి రిషి సునక్ ఆర్థికమంత్రిగా నియమితులయ్యే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో ఎకనామిక్ సూపర్ మినిస్ట్రీని నడిపేందుకు బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీకి చెందిన సీనియర్ సభ్యులు, డిప్యూటీ రిషిని వరించనున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

కీలక పదవి

కీలక పదవి

సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ తరఫున రిషి సునక్ యార్కషైర్‌లోని రిచ్‌మండ్ నుంచి గెలిచారు. ప్రధాని బోరిస్ జాన్సన్‌కు అత్యంత సన్నిహితులు. గత ప్రభుత్వంలో ఆయన డిప్యూటీ ఆర్థిక మంత్రిగా పని చేశారు. రిషి పని తీరు పట్ల బోరిస్ పూర్తి సంతృప్తిగా ఉన్నారట. తాజా ఎన్నికల నేపథ్యంలోను టీవీ చర్చల్లో చురుగ్గా పాల్గొని పార్టీ గెలుపులో రిషి కీలక పాత్ర పోషించారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి మంత్రివర్క విస్తరణలో ఆయనకు కీలక పదవి కట్టబెట్టే అవకాశముందని అంటున్నారు.

కొత్తగా ఏర్పాటయ్యే శాఖకు..

కొత్తగా ఏర్పాటయ్యే శాఖకు..

పునర్వ్యవస్థీకరణలో పూర్తి కేబినెట్ పోర్ట్ పోలియో పదోన్నతికి ట్రెజరరీ కన్జర్వేటివ్స్ ప్రధాన కార్యదర్శి సునక్ సిద్ధంగా ఉన్నారని పేర్కొంటున్నారు. ప్రధాని బోరిస్ జాన్సన్ అంతర్జాతీయ వాణిజ్య విభాగాన్ని ఆకర్షించేలా, విస్తరించేలా వ్యాపార మంత్రిత్వ శాఖ ఉండాలని భావిస్తున్నారు. ఇందుకు ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ వ్యాపార విభాగం వంటి ఉపశాఖలను విలీనం చేస్తూ ప్రస్తుతం ఉన్న ఆర్థిక శాఖను విస్తృత పరచాలని భావిస్తున్నారట. అలా కొత్తగా ఏర్పాటయ్యే శాఖకు రిషి సునక్ నేతృత్వం వహిస్తారు.

మూర్తి అల్లుడు.. భగవద్గీతపై ప్రమాణం చేసి...

మూర్తి అల్లుడు.. భగవద్గీతపై ప్రమాణం చేసి...

ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణమూర్తికి రిషి సునక్ అల్లుడు. సునక్.. బోరిస్ విశ్వాసాన్ని చూరగొంటున్నారని, బ్రెగ్జిట్‌లో ప్రధానికి అత్యంత నమ్మదగినవారు అని చెబుతున్నారు. ఆయన వయస్సు 39. ఇంగ్లాండులోని హాంప్‌షైర్ కౌంటీలో జన్మించారు. తాజా ఎన్నికల్లో రిచ్‌మండ్ నుంచి ఎంపీగా గెలిచారు. ఇక్కడి నుంచి ఆయన గెలుడం ఇది మూడోసారి. గతంలో థెరిసా మే ప్రభుత్వంలోను మంత్రిగా పని చేశారు. స్టాన్‌ఫోర్డ్ వర్సిటీలో ఎంబీయే చదివే రోజుల్లో సహ విద్యార్థిని నారాయణ మూర్తి కుమార్తె అక్షతామూర్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇటీవల దిగువ సభలో ప్రమాణ స్వీకారం సందర్భంగా భగవద్గీతపై ప్రమాణం చేసి వార్తల్లో నిలిచారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+