Mukesh Ambani: భారతదేశంలో తన కార్ల వ్యాపారంలో మెజారిటీ వాటాను విక్రయించాలని ప్రఖ్యాత కార్ మేకర్ MG మోటార్స్ నిర్ణయించింది. దీనికోసం ఇప్పటికే రిలయన్స్ గ్రూప్, హీరో మోటార్స్, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్, JSW గ్రూప్‌తో సహా అనేక వ్యాపార సంస్థలతో చర్చలు జరుపుతోంది.
బ్రిటీష్ కార్ బ్రాండ్ MG ప్రస్తుతం చైనీస్ ఆటో దిగ్గజం SAIC కింద వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఇండోచైనా ఉద్రిక్తతల కారణంగా పేరెంట్ కంపెనీల నుంచి తగినంత పెట్టుబడులకు ఆమోదాలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీంతో దేశీయ కంపెనీలతో భాగస్వామ్యం కలిగి ఉండటం ద్వారా తదుపరి దశ వృద్ధి బాట పట్టాలని కంపెనీ చూస్తోంది.

ప్రస్తుతం భారత ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తోంది. దీనికి అనుగుణంగా ఎంజీ మోటార్ గుజరాత్‌లో ఫ్యాక్టరీని స్థాపించడానికి, కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావటానికి దాదాపు రూ.5000 కోట్ల పెట్టుబడి అవసరమని తెలుస్తోంది. అయితే ఈ ప్లాంట్ లో ఉత్పత్తయ్యే కార్లలో ఎక్కువ శాతం ఎలక్ట్రిక్‌వే ఉంటాయని తెలుస్తోంది. ఇందుకోసం కంపెనీ భారత కంపెనీలతో తీవ్రమైన చర్చలు జరుపుతోంది. MG మోటార్ ఈ సంవత్సరం చివరి నాటికి ఒక ఒప్పందాన్ని ముగించాలని చూస్తోందని సమాచారం.
రానున్న ఐదేళ్ల కాలంలో కంపెనీ రూ.5000 కోట్ల పెట్టుబడి ద్వారా 2028 నాటికి ఏటా వాహనాల ఉత్పత్తిని 1.2 లక్షల యూనిట్లకు పెంచాలని చూస్తోంది. దీనికి తోడు బ్యాటరీ అసెంబ్లింగ్ ప్లాంట్, సెల్ తయారీ వంటి అవసరమైన టెక్నాలజీ కోసం జాయింట్ వెంటర్లు, థర్డ్ పార్టీ తయారీ ద్వారా ముందుకు సాగాలని చూస్తున్నట్లు MG మోటార్ ఇండియా CEO రాజీవ్ చాబా వెల్లడించారు.
ఇప్పటికే అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టిన రిలయన్స్ ఇండస్ట్రీస్, విప్రోలు ఇప్పుడు MG MOTOR ద్వారా ఆటోమొబైల్ రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో మరింత వ్యాపారాన్ని పొందాలనే లక్ష్యంతో MG MOTORలో పెట్టుబడులు పెడితే అది దేశీయ ఎలక్ట్రిక్ వాహన దిగ్గజంగా ఉన్న టాటా మోటార్స్‌కు గట్టి పోటీని ఇవ్వనుంది. ఇది రెండు కంపెనీల మధ్య ప్రత్యక్ష పోటీకి దారితీయనుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications