Brightcom Group Stock: ఇటీవలి కాలంలో స్టాక్ మార్కెట్లలోని ఇన్వెస్టర్లను మోసాల నుంచి కాపాడేందుకు నియంత్రణ సంస్థలు కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో నిబంధనలు పాటించని కంపెనీలపై తమ కఠిన వైఖరిని కొనసాగిస్తున్నాయి. అయితే ఇవి కొంత మంది ఇన్వెస్టర్లను కష్టాల్లోకి నెట్టేస్తున్నాయి.
వాస్తవానికి నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ బ్రైట్‌కామ్ గ్రూప్ షేర్లను Z కేటగిరీ కిందకు చేర్చింది. అలాగే జూన్ 14 నుంచి కంపెనీ షేర్లలో ట్రేడింగ్ నిలిపివేస్తున్నట్లు ఎన్ఎస్ఈ ప్రకటించింది. దీంతో కంపెనీ షేర్లు ఒక్కసారిగా లోయర్ సర్క్యూట్లను తాకటం ప్రారంభించింది. అయితే 15 రోజుల తర్వాత ట్రేడింగ్ పునరుద్ధరించబడుతుందని వెల్లడించినప్పటికీ అవి Z కేటగిరీ కింద జరుగుతాయని పేర్కొంది. దీంతో కంపెనీ షేర్లు కేవలం వారంలో ఒక్కరోజు చొప్పున తర్వాత 6 నెలల పాటు ట్రేడింగ్ కొనసాగించనున్నాయి.

వాస్తవానికి కంపెనీ ఎన్ఎస్ఈ రూల్స్ ప్రకారం వరుసగా రెండు త్రైమాసికాల్లో తమ ఆర్థిక ఫలితాలను ప్రకటించటంలో ఫెయిల్ కావటంతో కఠిన చర్యలు వచ్చాయి. ఇదే క్రమంలో కంపెనీ ప్రమోటర్ సురేష్ రెడ్డి షేర్ల అలాట్మెంట్ కేసులో ఉన్న తరుణంలో గందరగోళ పసిస్థితులు కంపెనీలో కొనసాగుతున్నాయి. దీంతో కంపెనీలో షేర్లు కలిగి ఉన్న దాదాపు 5.7 లక్షల మంది రిటైల్ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడి విలువను రోజురోజుకూ కోల్పోతున్నారు. ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో ప్రస్తుతం షేర్ లోయర్ సర్క్యూట్ తాకుతూ ఇన్వెస్టర్ల సంపదను క్షీణింపజేస్తోంది.
ఈ తరుణంలో ఎన్ఎస్ఈ చర్యల తర్వాత త్రైమాసిక ఫలితాలకు సంబంధించి బ్రైట్‌కామ్ గ్రూప్ ఒక వివరణను విడుదల చేసింది. జూన్ 11 నాటికి 2023-24 ఆర్థిక సంవత్సరం రెండవ, మూడవ త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను ప్రకటించేందుకు కృషి చేస్తున్నట్లు బ్రైట్‌కామ్ గ్రూప్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు వివరణ ఇచ్చింది. దీనికోసం తమ బృందం శ్రద్ధగా పనిచేస్తోందని వెల్లడించింది. ఈ టైమ్‌లైన్‌లకు కట్టుబడి ఉండటం ద్వారా ట్రేడింగ్ సస్పెన్షన్ నుంచి తప్పించుకోగలమనే నమ్మకం తమకు ఉందని గ్రూప్ తెలిపింది. కంపెనీపై ఇటీవల NSE సర్క్యులర్ జారీ తర్వాత నేడు రూ.11.66కి పడిపోయింది.
వాస్తవానికి ఆగస్ట్ 2023లో బ్రైట్‌కామ్ గ్రూప్‌పై సెబీ కఠినంగా వ్యవహరించింది. ఆ తర్వాత గ్రూప్ చైర్మన్ సురేష్‌రెడ్డి, సీఎఫ్‌వో నారాయణరాజులను పదవుల నుంచి తొలగించారు. అదే సమయంలో బ్రైట్‌కామ్ గ్రూప్‌పై చర్యను సడలించడానికి సెబీ నిరాకరించింది. ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన జరిగిన షేర్ల కేటాయింపులో అవకతవకలకు సంబంధించిన విషయంలో సెబీ చర్యలు కీలకంగా మారిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications