Salary in Wedding: ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోతోంది. దీనికితోడు దేశంలో నెలకొన్న నిరుద్యోగం, లేఆఫ్స్, నైపుణ్యాల లేమి వంటి సమస్యలు యువతను వేధిస్తున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ వ్యక్తి చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. దీన్ని చూసి పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు.
ముఖ్యంగా వివాహం విషయంలో దేశీయ యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వేతనం అనేది ఇక్కడ ముఖ్య భూమిక పోషిస్తోంది. యువతుల తల్లిదండ్రులు భారీ ప్యాకేజీ కావాలని, కేవలం IT ఉద్యోగులు మాత్రమే వరుడిగా రావాలని ఆశపడుతున్నారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగాలు మినహా ఇతర రంగాల్లో పనిచేస్తున్న యువకులకు వధువుల కొరత ఏర్పడుతోంది.

మరికొందరు ఇంకో అడుగు ముందుకేసి తమ కుమార్తెకు లక్షల కొద్దీ ప్యాకేజీ ఉన్న వరుడే కావాలని ఖండితంగా మాట్లాడుతున్నారు. వృత్తిపరంగా ఇంజనీర్ అయిన తన స్నేహితుడిని జీతం చాలా తక్కువ అనే కారణంగా ఓ మహిళ వివాహం చేసుకునేందుకు తిరస్కరించిందని ఓ వ్యక్తి Xలో పోస్ట్ చేశాడు. అయితే అతడి సంపాదన సంవత్సరానికి 8 లక్షలు (LPA) కావడం గమనార్హం.
ఆ అమ్మాయి కూడా గత సంవత్సరం తన ఉద్యోగాన్ని విడిచిపెట్టినట్లు ఆ వ్యక్తి తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఆమె జాబ్ చేసి అలసిపోవడంతో ఇప్పుడు ఏమీ చేయడం లేదని తెలిపాడు. ఈ అరేంజ్ మ్యారేజ్ కోసం కనీసం 25 లక్షల ప్యాకేజీ కలిగిన వరుడి కోసం వధువు తల్లిదండ్రులు వెదుకుతున్నట్లు వెల్లడించాడు. అందుకే తన స్నేహితుడిని తిరస్కరించినట్లు చెప్పాడు. ఇప్పుడు ఈ ట్వీట్ విపరీతంగా వైరల్ అవుతోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications