అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలతో మళ్లీ ట్రేడ్ వార్ కు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా ట్రంప్ సుంకాలన్నీ బ్రిక్స్ దేశాలు టార్గెట్ గా ఉన్నాయి. బ్రిక్స్ దేశాలపై భారీ స్థాయిలు సుంకాలను విధించారు.బ్రెజిల్, భారతదేశం వంటి దేశాలపై 50 శాతం టారిఫ్ విధిస్తూ కీలక నిర్ఱయం తీసుకున్నారు.
ఈ దేశాలు రష్యా చమురు కొనుగోళ్లు ఆపడం లేదని..అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ ప్రభుత్వం తెలిపింది. గతంలోనే భారత్ మీద 25 శాతం సుంకాలు విధించి వైట్ హైస్ తాజాగా ఇండియా నుండి అమెరికాకు వచ్చే వస్తువులపై అదనంగా 5% సుంకాన్ని విధిస్తున్నట్లు ఉత్తర్వు జారీ చేసింది. దీంతో భారత్ మీద వేసిన సుంకాలు 50 శాతానికి చేరాయి.
ఇక మరో BRICS దేశం బ్రెజిల్ నుంచి దిగుమతులపై కూడా డొనాల్డ్ ట్రంప్ భారీ సుంకాలను అమలు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ట్రంప్ ఆప్త మిత్రుడు జైర్ బోల్సోనారోపై జరుగుతున్న విచారణలపై వ్యతిరేకత అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ట్రంప్ తీసుకున్న ఈ చర్యలు BRICS దేశాల మధ్య ఆయనకు దూరాన్నిపెంచాయి. BRICS దేశాల మధ్య సంబంధాలు చిగురించేదుంకు దోహదపడుతున్నాయి.

అగ్రరాజ్యం అమెరికా సుంకాల దాడులు BRICS దేశాల మధ్య ఐక్యతకు దారి తీసేలా కనిపిస్తున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏడు సంవత్సరాల గ్యాప్ తర్వాత చైనాను సందర్శించనున్నట్లు ప్రకటించారు. ఈ పర్యటన న్యూఢిల్లీ, బీజింగ్ మధ్య గల ఉద్రిక్తతలను చల్చార్చే అవకాశం ఉంది. అదే సమయంలో.. బ్రెజిల్ అధ్యక్షుడు లులా డ సిల్వా ట్రంప్ అదనపు సుంకాలపై ఉమ్మడి స్పందన కోసం చర్చించేందుకు భారతదేశం, చైనా నాయకులను పిలవాలని భావిస్తున్నట్లు తెలిపారు.
అయితే.. BRICS అంతర్గతంగా చాలావరకు విభిన్న స్వభావం కలిగిన దేశాల సముదాయంగా చెప్పుకోవచ్చు. చారిత్రకంగా చూసుకున్నట్లయితే వీరి వాణిజ్య పరస్పర సంబంధాలు బలహీనంగా ఉన్నాయి. ఉదాహరణకు చెప్పాలంటే చైనా ఎగుమతులలో BRICS దేశాల వాటా కేవలం 9 శాతం మాత్రమే, ఇది US 15 శాతం వాటాగా ఉంది. అభివృద్ధి చెందుతున్న ఆసియాతో పోల్చితే తక్కువే కూడా చైనా వాటా తక్కువగానే ఉంది. అయినప్పటికీ ఇటీవల చైనా-రష్యా మధ్య వాణిజ్యం 244.8 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయికి చేరుకోవడం చెప్పుకోదగ్గ పరిణామం.
ట్రంప్ టారిఫ్ దూకుడుతో BRICS దేశాలు తాత్కాలికంగా ఏకమయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడి, కరెన్సీ వినియోగం రంగాలలో ఈ దేశాలన్నీ కలిసి పనిచేసే అవకాశం ఉంది. ఇదే సమయంలో దీర్ఘకాలికంగా చైనా ఆధిపత్యాన్ని భారతదేశం అంగీకరించదనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది.
ప్రస్తుతానికి ట్రంప్ విధిస్తున్న సుంకాలు BRICS దేశాలకు మాత్రమే పరిమితం కావడం వల్ల.. ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ స్థానాన్ని సమర్థించుకునేందుకు పరస్పర మద్దతుతో ముందుకు సాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. . ఇది నిజంగా ప్రపంచ వాణిజ్య కూటముల ఐక్యతకు నాంది కావచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
More From GoodReturns

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications