X suspension: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కి కొత్త సమస్య వచ్చి పడింది. ఎంతో ముచ్చటపడి బిలియన్ల కొద్దీ వెచ్చించి కొనుగోలు చేసిన X ఇప్పుడు ఓ చోట సంకట స్థితిలో పడింది. తమ ఆదేశాలను పాటించాల్సిందేనని ఆ దేశం చెబుతున్నా, మస్క్ మాత్రం ఏకంగా సుప్రీంకోర్టు జడ్జితో ట్వీట్ వార్ మొదలుపెట్టారు. దీనికి ఎప్పుడు ముగింపు దొరుకుతుందోనని పలువురు ఎదురుచూస్తున్నారు.
బ్రెజిల్‌లోని తన మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ X కోసం చట్టపరమైన ప్రతినిధి ఎవరో 24 గంటల్లోగా వెల్లడించాలని బ్రెజిల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. లేనిపక్షంలో తమ దేశంలో ఆ సైట్ సస్పెన్షన్‌ను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం నాటి కోర్టు నిర్ణయాన్ని స్క్రీన్ షాట్ తీసి సుప్రీంకోర్టు తన X ఖాతాలో పంచుకుంది. దీనికి మస్క్ సహా X గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ ఖాతాలను ట్యాగ్ చేసింది.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ నుంచి కొంత కంటెంట్‌ను తీసివేయాలన్న తన ఆదేశాలను పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తి అలెగ్జాండర్ డి మోరేస్ బెదిరించినట్లు X ఆరోపించింది. లేకపోతే అరెస్ట్ చేస్తామని బ్రెజిల్‌లోని కంపెనీ ప్రతినిధిపై రహస్యంగా ఒత్తిడి తెస్తున్నట్లు పేర్కొంది. మోరేస్ సెన్సార్‌షిప్ ఆర్డర్స్ కారణంగా బ్రెజిల్‌లో తన కార్యకలాపాలను మూసివేస్తామని, సిబ్బందిని తొలగిస్తామని ఈ నెల ప్రారంభంలోనే ప్రకటించింది. అయితే తమ సేవలు మాత్రం బ్రెజిల్‌లోని వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది.
అయితే బుధవారం తీర్పులో, దేశ చట్టాల ప్రకారం కొన్ని సందర్భాల్లో ఇంటర్నెట్ సమస్యలను నియంత్రించాల్సిందేనని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. బ్రెజిలియన్ చట్టాన్ని లేదా ప్రైవేట్ సమాచారం గోప్యతను గౌరవించని కంపెనీల కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తామని మోరేస్ హెచ్చరించారు. గంటల వ్యవధిలోనే మస్క్ ఆ ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. మోరేస్ పదేపదే అధికార ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఆరోపించారు. న్యాయమూర్తిగా చేసిన ప్రమాణాలకు ఏ మాత్రం విలువ ఇవ్వడం లేదన్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో మాజీ ప్రెసిడెంట్ జైర్ బోల్సోనారో ప్రభుత్వ హయాంలో జరిగిన ఘటనలకు సంబంధించి న్యాయమూర్తి మోరేస్ Xకు కొన్ని ఆదేశాలు జారీచేశారు. అప్పట్లో నకిలీ వార్తలు మరియు ద్వేషపూరిత సందేశాలను వ్యాప్తి చేశారని ఆరోపిస్తూ 'డిజిటల్ మిలీషియా' అనే పరిశోధనలలో భాగమైన నిర్దిష్ట ఖాతాలను బ్లాక్ చేయమని కోరారు. మస్క్ ఆ నిర్ణయాన్ని సవాలు చేసి, న్యాయమూర్తి బ్లాక్ చేయమని ఆదేశించిన ఖాతాలను మళ్లీ యాక్టివేట్ చేస్తానని చెప్పడంతో ఈ వివాదం మొదలైంది. దీంతో చిర్రెత్తుకొచ్చిన మోరేస్ ఏప్రిల్ ప్రారంభంలో బిలియనీర్‌పై విచారణ ప్రారంభించారు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications