బ్రాండెడ్ పామ్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ ధరలు రూ.10 నుండి రూ.15 వరకు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరలు తగ్గడంతో మన వద్ద కూడా బ్రాండెడ్ ఆయిల్ కంపెనీలు ధరలను తగ్గించాయి. పామాయిల్ ధర రూ.7 నుండి రూ.8 వరకు, సన్ ఫ్లవర్ ఆయిల్ రూ.10 నుండి రూ.15 వరకు తగ్గింది. సోయాబీన్ ఆయిల్ రూ.5 వరకు తగ్గింది. గతవారం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి పామోలిన్, సోయా నూనెల ధరలు ఆరు శాతం నుండి 11 శాతం తగ్గడంతో, ఇందుకు అనుగుణంగా ధరలు తగ్గించే అవకాశం ఏర్పడిందని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీవీ మెహతా తెలిపారు.
సరఫరా పరిస్థితులు మెరుగుపడవచ్చుననే ఉద్దేశ్యంతో కంపెనీలు ధరలు తగ్గిస్తున్నాయి. సన్ ఫ్లవర్ నూనె ఉక్రెయిన్ నుండి మనకు 70 శాతం దిగుమతి అవుతుంది. రష్యాతో యుద్ధం వల్ల సరఫరాలో సమస్యలు తలెత్తాయి. ఇప్పుడు రష్యా, అర్జెంటీనా వంటి దేశాల నుండి సన్ ఫ్లవర్ దిగుమతి చేసుకోవడం ధరలు తగ్గడానికి దోహదపడింది. అయితే ధరలు తగ్గినప్పటికీ, ఈ ధరలు అందుబాటులోకి రావడానికి సమయం పడుతుంది.

ప్రస్తుతం సోయాబీన్ లీటర్ ధర రూ.200 నుండి రూ.220 మధ్య ఉండగా సన్ ఫ్లవర్ రూ.220 నుండి రూ.230 మధ్య ఉంది. ఇది ఎమ్మార్పీ అయినప్పటికీ మార్కెట్లో ఇంత కంటే తక్కువకు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత తగ్గింపు ప్రయోజనం కస్టమర్లకు చేరడానికి మరింత సమయం పడుతుంది. పక్షం రోజుల వరకు పట్టవచ్చునని తెలుస్తోంది. అదానీ విల్మర్, రుచి సోయా, జెమిని ఎడిబుల్స్ ఇప్పటికే ధరలను తగ్గించింది. రైస్ బ్రాన్ ఆయిల్ రిటైల్‌గా రూ.180 వరకు, సన్ ఫ్లవర్ రూ.190 వరకు ఉంది.


Click it and Unblock the Notifications