IPO News: గ్రేమార్కెట్లో 100% లాభంలో ఐపీవో.. మీరూ ఆ ఐపీవోపై బెట్టింగ్ వేస్తున్నారా?

Brace Port Logistics IPO: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐపీవోల విజయ పరంపరం కొనసాగుతూనే ఉంది. వాస్తవానికి ఈక్విటీ మార్కెట్లు ఓలటాలితటీలో కొనసాగుతున్నప్పటికీ ఐపీవోలు మాత్రం బెట్టింగ్ వేసిన ఇన్వెస్టర్లకు భారీగా రాబడులను తెచ్చిపెడుతున్నాయి. రోజుల వ్యవధిలోనే సంపద డబుల్ కావటంపై వారు ఎక్కువ దృష్టిని సారిస్తున్నారు.

ఈ క్రమంలో త్వరలోనే లాజిస్టిక్స్ కంపెనీ ఐపీవో ప్రజల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది బ్రేస్ పోర్ట్ లాజిస్టిక్స్ కంపెనీ గురించే. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కంపెనీ తన ఐపీవోను ఆగస్టు 19న ప్రారంభించాలని నిర్ణయించింది. ఐపీవోలో పాల్గొని బెట్టింగ్ వేయాలనుకుంటున్న ఇన్వెస్టర్లకు ఆగస్టు 21 వరకు ఇష్యూ తెరచి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఎస్ఎమ్ఈ కేటగిరీలో వస్తున్న కంపెనీ తాజా ఐపీవో ద్వారూ రూ.24.41 కోట్లను స్టాక్ మార్కెట్ల నుంచి సమీకరించాలని చూస్తోంది. ఎన్ఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో లిస్టింగ్ కోసం ప్రయత్నిస్తున్న కంపెనీ తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను ఒక్కో షేరుకు రూ.76 నుంచి రూ.80గా నిర్ణయించింది.

Brace Port Logistics IPO trading with 100Percent GMP even before opening to subscription

ఎవరైనా ఇన్వెస్టర్ ఐపీవో కోసం దరఖాస్తు చేసుకునేందుకు కనీసం 1600 షేర్లు కొనాలని లాట్ పరిమాణాన్ని కంపెనీ ఫిక్స్ చేసింది. ఐపీవో తెరుచుకోక ముందే పెట్టుబడిదారుల నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. ఈ క్రమంలో గ్రే మార్కెట్‌లో బ్రేస్ పోర్ట్ లాజిస్టిక్స్ ఐపీవో షేర్లు 100 శాతం ప్రీమియం ధర పలుకుతున్నాయి. ఇన్వెస్టోగెయిన్ ప్రకారం నేడు లాజిస్టిక్స్ కంపెనీ షేర్లకు రూ.80 ప్రీమియం ధర పలుకుతోంది. అంటే ఈ లెక్కన లిస్టింగ్ రోజు వరకు ఇదే ధర కొనసాగితే షేర్లు ఒక్కోటి మార్కెట్లో రూ.160 వద్ద జాబితా కావచ్చు. ఇదే జరిగితే ఐపీవోపై బెట్టింగ్ వేసిన పెట్టుబడిదారులు మెుదటి రోజే 100 శాతం లాభాలను అందుకుంటారు.

బ్రేస్ పోర్ట్ లాజిస్టిక్స్ అనేది సేవా ఆధారిత లాజిస్టిక్స్ కంపెనీ. ఇది ప్రధానంగా ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాల్లో పనిచేస్తున్న తన వినియోగదారులకు ఓషన్ కార్గో లాజిస్టిక్స్ సేవలను అందించే వ్యాపారంలో ఉంది. అలాగే కంపెనీ ఎయిర్ ఫ్రైట్, వేర్‌హౌసింగ్ సౌకర్యాలు, విదేశాల్లో కార్గోను నిర్వహించడం, ఇతర విదేశీ దేశాలకు డెలివరీ చేయడం, కస్టమ్స్ క్లియరెన్స్ సేవలు వంటి ప్రత్యేక కార్గో సేవలు వంటి వివిధ విలువ జోడించిన సేవలను కూడా అందిస్తారు. కంపెనీ మా గ్రూప్ కంపెనీలు, హోల్డింగ్ కంపెనీతో ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైన నెట్‌వర్క్‌ను కలిగి సేవలను అందిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+