For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలా ఉద్యోగం ఇష్టంలేదా..: ఉద్యోగులకు BPCL వీఆర్ఎస్ ఆఫర్, ప్రయోజనాలు ఇవే..

|

ప్రభుత్వరంగ భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (BPCL) దేశంలో రెండో అతిపెద్ద ఇంధన రిటైలర్. దీని ప్రయివేటీకరణకు ముందు కంపెనీ తమ ఉద్యోగులకు స్వచ్చంధ పదవీ విరమణ పథకం(Voluntary Retirement Scheme-VRS)ను ప్రవేశపెట్టింది. వివిధ వ్యక్తిగత కారణాలతో కంపెనీలో పని చేయలేని ఉద్యోగులకు ఈ పథకాన్ని ప్రవేశ పెట్టాలని నిర్ణయించినట్లు బీపీసీఎల్ ఉద్యోగులకు పంపిన తన నోటీసులో తెలిపింది.

చైనాకు 'స్మార్ట్' దెబ్బ, భారీగా పడిపోయిన చైనీస్ ఫోన్ల సేల్: శాంసంగ్ సేల్స్ అదుర్స్చైనాకు 'స్మార్ట్' దెబ్బ, భారీగా పడిపోయిన చైనీస్ ఫోన్ల సేల్: శాంసంగ్ సేల్స్ అదుర్స్

వీఆర్ఎస్ పథకం ముగింపు

వీఆర్ఎస్ పథకం ముగింపు

- భారత్ పెట్రోలియం వాలంటరీ రిటైర్మెంట్ స్కీం-2020 జూలై 23వ తేదీన ప్రారంభమైంది. ఆగస్ట్ 13వ తేదీన ఈ పథకం ముగుస్తుంది.

- వివిధ కారణాలతో పాటు ప్రయివేటు మేనేజ్‌మెంట్ కింద పని చేయడం ఆసక్తి లేని ఉద్యోగులు లేదా ఆఫీసర్‌ల కోసం ఎగ్జిట్ ఆఫర్ తీసుకు వచ్చినట్లు చెబుతున్నారు. ఎందుకంటే బీపీసీఎల్ ప్రయివేటైజేషన్ అయ్యాక తమ ఉద్యోగ స్థానం, ప్రాంతంలో మార్పులు ఉంటాయని కొంతమంది భావిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో పని చేయలేని వారి కోసం వీఆర్ఎస్ పథకాన్ని ఉపయోగించుకోవచ్చునని చెబుతున్నారు.

45 ఏళ్లకు పైగా ఉంటే అర్హులు

45 ఏళ్లకు పైగా ఉంటే అర్హులు

20,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్న బీపీసీఎల్‌లో 52.98 శాతం వాటాను ప్రభుత్వం విక్రయిస్తోంది. వాటాల కొనుగోలుకు ఆసక్తి కలిగిన సంస్థలు ఆసక్తి వ్యక్తీకరణ తెలియజేసే తుది గడువు జూలై 31. బీపీసీఎల్ ప్రయివేటీకరణ ద్వారా రూ.2 లక్షల కోట్లు సమీకరించాలనే లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలని ఆర్థిక శాఖ భావిస్తోంది. దాదాపు 5 శాతం నుండి 10 శాతం మంది ఉద్యోగులు వీఆర్ఎస్ తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. 45 ఏళ్లకు పైబడిన ఉద్యోగులు వీఆర్ఎస్ తీసుకోవడానికి అర్హులుగా తెలుస్తోంది.

వీఆర్ఎస్ ప్రయోజనాలివే..

వీఆర్ఎస్ ప్రయోజనాలివే..

వీఆర్ఎస్ తీసుకునే ఉద్యోగులు కంపెనీలో ఎలాంటి పదవి చేపట్టడానికి అనర్హులు అని తెలిపింది. వీఆర్ఎస్ ఎంచుకునే ఉద్యోగులకు పరిహారం కూడా ఆకర్షణీయంగా ఉందని చెబుతున్నారు. వీఆర్ఎస్‌కు అర్హులైన వారందరికీ వారు సంస్థలో పని చేసినంత కాలం ప్రతి ఏడాది సర్వీసుకు 2 నెలల వేతనం లేదా వీఆర్ఎస్ తీసుకున్న నాటికి రిటైర్మెంట్‌కు మధ్య ఉన్న సేవలకు లెక్కగట్టి అన్ని నెలల వేతనం పరిహారంగా ఇస్తారు. వీఆర్ఎస్ నాటికి వారికి గల సీఎల్, పీఎల్ కూడా నగదుగా మార్చుకునేందుకు అనుమతి ఇస్తారు. అలాగే రిటైర్మెంట్ సమయంలో చెల్లించాల్సిన రిపాట్రియేషన్ ఛార్జీలు ఉంటే అవి చెల్లిస్తారు. రిటైర్మెంట్ అనంతర వైద్య ప్రయోజన పథకం కింద వైద్య ప్రయోజనాలు పొందేందుకు కూడా అర్హులే.

English summary

అలా ఉద్యోగం ఇష్టంలేదా..: ఉద్యోగులకు BPCL వీఆర్ఎస్ ఆఫర్, ప్రయోజనాలు ఇవే.. | BPCL offers voluntary retirement ahead of privatisation

State owned Bharat Petroleum Corporation Ltd. has introduced a voluntary retirement scheme for its employees ahead of the government privatising the country's second-largest fuel retailer.
Story first published: Monday, July 27, 2020, 7:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X